మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట జూనియర్ కాలేజీలో M21 ఆధ్వర్యంలో రాజ్యాంగదినోత్సవం.

 భారత సమాజంలో వివక్షకు గురయ్యే  అన్ని వర్గాల ప్రజలకు సమానత్వము  సమన్యాయం అందించడమే m21 ధ్యేయం.

- చిలుకూరి కమల్, మంచిర్యాల జిల్లా ఎం21 ప్రచారకుడు.

 వ్యాసరచన ఉపన్యాస పోటీ విజేతలతో M 21 సంస్థ నిర్వాహకులు కాలేజీ లెక్చరర్ల బృందం.
 
 ఉపన్యాస పోటీలో పాల్గొన్న విద్యార్థులు.




Scv News Kasipet:--

కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో ఈరోజు 21వ శతాబ్దపు బహుజన ఉద్యమం M21 ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు.ముఖ్యఅతిథిగా హాజరైన కమల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత సమాజంలో వేల ఏళ్లుగా సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా  వివక్షకు గురవుతున్న మెజారిటీ ప్రజలకు సమానత్వము సమన్యాయం అందించడమే ధ్యేయంగా 21వ శతాబ్దపు బహుజన ఉద్యమ సంస్థ M 21 పనిచేస్తుందని మంచిర్యాల జిల్లా ప్రచారకుడు చిలుకూరి కమల్ అన్నారు.


మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని జూనియర్ కాలేజీలో m 21 మండల శాఖ  ఆధ్వర్యంలో నిర్వహించిన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ప్రపంచ దేశాల్లో ప్రజల్లో వర్గాలు ఉంటే ఈ దేశంలో కులాలు ఉన్నాయని 15% ఉన్న ఆధిపత్య కులాలు 85 శాతం ఉన్న బహుజన వర్గాలను అణచి వేస్తున్నాయన్నారు. అంబేద్కర్ తదనంతరం  పూలే అంబేద్కర్ భావజాలంతో ఎన్నో ఉద్యమాలు ప్రారంభమైన బహుజన వర్గాలన్నీటిని ఏకతాటిపై నిలప లేకపోయారని అన్నారు.గత ఉద్యమాల వైఫల్యాల ను అధ్యయనం చేసి 21వ శతాబ్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టామని అన్నారు.

M21 జిల్లా కమిటీ సభ్యులు ఎడ్ల కిష్టయ్య మాట్లాడుతూ


 దేశంలో రాజ్యాంగం అమలుకు  ముందు వేల సంవత్సరాలుగా  బహుజన వర్గాలకు ఎలాంటి స్వేచ్ఛ స్వాతంత్రం లేని అసమానతలు కూడుకున్న మనుధర్మ శాస్త్రం అమలులో ఉండేదని అన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఆధిపత్య వర్గాలే పాలకులుగా ఉండి రాజ్యాంగం పై అవగాహన  మెజారిటీ బహుజన వర్గాలను అణిచివేస్తు పాలన సాగిస్తున్నా యాన్నారు. విద్యార్థులు రాజ్యాంగంలోని హక్కులను తెలుసుకోవాలన్నారు.

ఎం 21 జిల్లా కమిటీ సభ్యుడు   బక్కయ్య మాట్లాడుతూ


బాబా సాహెబ్ అంబేద్కర్ ఎన్నో కష్టాలను, దాడులను ఎదుర్కొని రాజ్యాంగాన్ని రచించాడని విద్యార్థులు రాజ్యాంగం గురించి తెలుసుకుంటూ లక్ష్యాలు పెద్దగా పెట్టుకొని చదువుకోవాలన్నారు. విద్యార్థులంతా కుల,మత,లింగ, వివక్షత లేని సమాజం కోసం పాటుపడాలన్నారు.

M21 మంచిర్యాల జిల్లా ఆపరేషన్ టీం సభ్యుడు  కొమ్ముల బాపు మాట్లాడుతూ


 సమాజంలో బహుజన వర్గం తలెత్తుకుని  గౌరవంగా బ్రతకడం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని హక్కుల వల్ల నే అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం లోని హక్కులు బాధ్యతలు తెలుసు కోవాలన్నారు. ముఖ్యంగా విద్యార్థు లంతా భారత రాజ్యాంగాన్ని చదివి హక్కులు, బాధ్యతలను, తెలుసుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు.

M 21 కాసిపేట మండల  సభ్యుడు మహేష్ మాట్లాడుతూ


విద్యార్థులు ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని చదివి పుస్తకాన్ని తమ ఇంట్లో పెట్టుకోవాలని సూచించారు. విద్య తోపాటు ఆరోగ్యం పై కూడా శ్రద్ధ వహించాలని కోరారు.


తదనంతరం రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా రాజ్యాంగం పై అవగాహన గురించి కాలేజీ విద్యార్థులకు  వ్యాసరచన  ఉపన్యాస పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతులను అందజేశారు. వ్యాస రచన పోటీలలో ప్రతిభ చూపిన జూనియర్ కాలేజీ విద్యార్థి అంజలికి ప్రధమ బహుమతి, మోడల్ కాలేజీ విద్యార్థి అక్షయ్   ద్వితీయ బహుమతులను గెలుచుకున్నారు . ఉపన్యాస పోటీలలో  మోడల్ కాలేజీ విద్యార్థిని రమ్యకు ప్రధమ  బహుమతి, జూనియర్ కాలేజీ విద్యార్థి రక్షిత్ కు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు .  వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు  M 21 నిర్వాహకు లతో పాటు కాలేజీ అధ్యాపక బృందం  జ్యోతి కుమార్,రమేష్ చంద్రశేఖర్, భాగ్య, సత్యమ్మలు బహుమతులను అందజేశారు.

 విద్యార్థులకు అవగాహన కల్పించేందుకే రాజ్యాంగ దినోత్సవం.

 మండల M21 ఇన్చార్జి పల్లె మల్లయ్య మాట్లాడుతూ 


రాజ్యాంగం పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గత మూడు సంవత్సరాలుగా జూనియర్ కాలేజీలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. గత రెండు సంవత్సరా లు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించామని  ఈ సంవత్సరం 21వ శతాబ్దపు బహుజన ఉద్యమం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. రాజ్యాంగం పై అవగాహన కల్పించే వ్యాసరచన ఉపన్యాస పోటీలలో కాలేజీ విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసినందుకు ఎం21 తరపున అభినందనలు తెలుపుతూ వందన సమర్పణ తెలిపారు.