కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ను గెలిపించాలని పెద్దనపల్లి పంచాయతీలో కాంగ్రెస్ ప్రచారం.

పెద్దనపల్లిలో వేముల కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రచారం.
Scv News Kasipet:--
కాసిపేట మండలం పెద్దనపల్లి గ్రామ పంచాయతీ న్యూ కాలనీ లో కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు వర్గం మండల అధ్యక్షులు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్ గారిని భారీ మెజార్టీ తో గెలిపించాలని గడప గడపకు ప్రచారం నిర్వహించడం జరిగినది.ఇందులో భాగంగా గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టే 6 గ్యారంటీ లను వివరిస్తూ,తప్పని సరిగా గడ్డం వినోద్ చేయి గుర్తు కు ఓట్ వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ప్రచారం చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో మండల ఇంచార్జి జగన్నాధం,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,లంబడి తండా (కే) ఉప సర్పంచ్ జర్పుల తిరుమల్,వార్డు సభ్యులు కొత్త రమేష్,బన్న హిందుమతి,కంచర్ల పద్మ,కొమురక్క,సీనియర్ నాయకులు గాధం గట్టయ్య, కూకట్ల దేవేందర్,కంచర్ల అనిల్,నందికొండ శ్రీధర్,బన్న శ్రీను,మధు,నవీన్,అభిబ్,స్వరాజ్,ఇనుముల రవి,సంజీవ్,పైడిమల్ల జనార్దన్,సన్నీ,భీమేష్,వేముల నరేష్,మరియు గ్రామ మహిళలు పాల్గొన్నారు.