సింగరేణి కార్మికులకు ఓటర్ పై అవగాహన.

కాసిపేట 2 గని పై కార్మికులకు ఓటు పై అవగాహన కల్పిస్తున్న కళాజాత బృందం.
Scv News Kasipet:--
మందమర్రి ఏరియా కాసిపేట 2 గని ఆవరణ లో సోమవారం
మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు DRDA వారి ఆధ్వర్యంలో కార్మికులకు ఓటరు అవగాహన కళాజాత నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో కార్మికులు 100%పోలింగ్ అయ్యేందుకు కృషి చెయ్యాలని, కార్మికులు ప్రజల్ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కళజాత ద్వారా కళ కారులు ఆటపాటల ద్వారా తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో కళాకారులూ ముల్కల్ల మురళి, వెళ్తూరు పోశం, మామిళ్ళ లచ్చన్న, రామటెంకి రాజా తిరుపతి,వడకపురం రవికుమార్, కొప్పర్తి రవీందర్, సల్లూరి కిష్టయ్య, గోడిశెల క్రిష్ణ, సల్లూరి సత్యనారాయణ, మిట్టపల్లి సంధ్య, drda sbm రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.