దేవాపూర్ లో..
మాదిగల విశ్వరూపం మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల.

మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని పోస్టర్ విడుదల చేస్తున్న మాదిగ దండోరా నాయకులు.
Scv News Kasipet :--
కాసిపేట మండలం దేవపూర్ మేజర్ పంచాయతీలోని అంబేద్కర్ భవన్లో ఈరోజు MRPS గ్రామ అధ్యక్షులు రామెల్ల కళ్యాణ్ మాదిగ, MRPS జిల్లా ఉపాధ్యక్షుడు ములకల ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో మాదిగల గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి పిలుపుమేరకు మాదిగల విశ్వరూప మహాసభను విజయవంత చేయాలనే పోస్టర్ను విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో మండల మాదిగ దండోరా నాయకులు పంగ లక్ష్మణ్ అటుకాపురం రమేష్,అటుకపురం రాజ్ కుమార్, గుట్ట లింగమూర్తి, గద్దల లవన్, రామిల దిలీప్, రాముల మహేష్,నాతరి రమేష్, అటకపురం తిరుపతి,కందుకూరి కిరణ్, చిలుముల మల్లేష్, ములకల సంపత్, రాత్రి శ్రావణ్ కుమార్, కమల బాబు, కంబల వంశీ, సిహెచ్ సాయి అనిల్, కే అంజయ్య లు హాజరయ్యారు. విశ్వరూప మహాసభను విజయవంతం చేయడానికి యాదవులు, మేదర సంఘం నాయకులు ఫోర్ శ్రీనివాస్,పనాల సురేష్,పనుల మహేష్, గొట్టే ప్రభాకర్,జక్కుల చంటిలు మద్దతు పలికారు.