తెలంగాణకు కెసిఆర్ పాలనే శ్రీరామరక్ష మూడోసారి ఆశీర్వదించండి.
- మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
![]() |
| కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. |
![]() |
| కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్న నియోజకవర్గ ఇన్చార్జి ఎంపీ వెంకటేష్ నేత. |
Scv News Kasipet--
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన తర్వాత గత తొమ్మిదేళ్ల పరిపాలనలో కెసిఆర్ దేశంలోనే గర్వించదగ్గ ఎన్నో సంక్షేమ పథకాలు, సుపరిపాలన అందించాడని తెలంగాణను మరింత అభివృద్ధి దిశగా తీసుక పోయేందుకు మూడోసారి కూడా ప్రజలు ఆశీర్వదించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ లో పేద ప్రజలను ఆదుకునేందుకు ఆసరా, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి లాంటి ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది కెసిఆర్ ప్రభుత్వమేనన్నారు. కాసిపేట మండలంలోని కొండాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి వైపు పయనించింద ని కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో రహదారుల నిర్మాణం, వంతెనల నిర్మాణం కోసం కోట్లాది నిధులు వ్యయం చేసామని అన్నారు. గత పది ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్నానని, రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కుటుంబంతో ఉండి ప్రజలకు అందుబాటులో ఉన్న వ్యక్తిని తానేనని అన్నారు. కొంతమంది నేతలు హైదరాబాదులో ఉండి నోట్ల కట్టలతో ఎన్నికల సమయంలో నియోజకవర్గం లోకి వచ్చి ప్రజలను మభ్యపెడుతున్నారని వీరి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. తనకు టికెట్టు రాకుండా ఎన్నో అవాంతరాలు సృష్టించి, తనపై ఎన్నో తప్పుడు ప్రచారాలు చేసిన న్యాయం నా వైపు ఉండడం వల్ల మళ్లీ నాకు టికెట్ వచ్చిందని అన్నారు. గత పది ఏళ్ల కాలంలో తెలవకుండా ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగించిన పెద్ద మనసుతో నన్ను క్షమించాలని మూడోసారి తనను గెలిపించాలని శిరస్సు వంచి వేడుకుంటున్నానని అన్నా రు.
నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ నేత మాట్లాడుతూ గత రెండు పర్యాయాలు కాసిపేట మండలం నుండి దుర్గం చిన్నయ్య కు అత్యధిక ఓట్లు వేసి గెలిపించారని మళ్లీ మూడోసారి కూడా గెలిచేందుకు కార్యకర్తలు పట్టుదలతో పని చేయాలన్నారు. గత పది ఏళ్ల కెసిఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ఈ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జెడ్పిటిసి పల్లె చంద్రయ్య, రైతు మండల సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోశం, మద్దిమడ సర్పంచి ఆడే జంగు, సోమగూడెం కే సర్పంచ్ సపోర్ట్ శంకర్, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు గత పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బడావత్ నీలా, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజుల రెడ్డి, అప్పాల శేఖర్ ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల నాయకులు పాల్గొన్నారు. సమావేశానికి మండల పరిషత్ వైస్ ప్రెసిడెంట్ విక్రమ్ రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ నేత మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పార్టీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.


