ఆదివాసి సేన ఆధ్వర్యంలో కొండాపూర్ లో కొమరం భీమ్ వర్ధంతి.
![]() |
![]() |
| కొమురం భీం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న గిరిజనులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం కొండాపూర్ చౌరస్తాలో ఆదివాసి సేన మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ 83వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయ బద్దంగా డప్పు డోలు వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి కొండాపూర్ చౌరస్తాలో గిరిజనులు పూజలు నిర్వహించి జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సేన మండల శాఖ అధ్యక్షుడు మాడావి వెంకటేష్ మాట్లాడుతూ జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసి అమరుడైన గిరిజన పోరాట యోధుడు కొమురం భీమ్ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ న్యాయమైన సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపు నిచ్చారు. గ్రామాల్లో గిరిజన యువకులు చెడు వ్యసనాలకు గురికాకుండా విద్యపై దృష్టి పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన గౌరవాధ్యక్షుడు మడవి గంగారాం, గ్రామ పటేల్ రాము, రాయి సెంటర్ మండల శాఖ అధ్యక్షుడు మేశ్రమ్ మహదు, ఉపమేడి కుమురం జనార్ధన్, మండల తుడుం దెబ్బ అధ్యక్షుడు సండ్ర భూమయ్య, తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి సోయం జంగు ఆదివాసీ సేన మండల ప్రధాన కార్యదర్శి సిడం గణపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం శంకర్, ఉపాధ్యక్షులు పెంద్రం ప్రభాకర్, మోతిరామ్ కోశాధికారి ఆత్రం సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

