గిరిజన నేత కొమ్ముల బాపు జన్మదిన సందర్భంగా పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణి.
![]() |
| నాయక్ పోడు సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు జన్మదిన సందర్భంగా గిరిజన పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేస్తున్న దృశ్యం . |
Scv News Kasipet:--
నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపన జన్మదిన సందర్భంగా ఈరోజు మూడు గిరిజన పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు.
కాసిపేట మండలం పెద్దగూడెం, గోండుగూడెం, నాయకపు గూడ గిరిజన ప్రాథమిక పాఠశాలలో జన్మదిన వేడుకలు జరుపుకొని నోట్ బుక్స్ పెన్నులు అంద జేయడం జరిగింది. సామాజిక స్పృహ కలిగిన కొమ్ముల బాపన్న మండలంలో గిరిజన నేతగా, సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శిగా ప్రజలను చైతన్యవంతం చేసే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ మండలంలో ఆదర్శ గిరిజన నేతగా అందరి అభిమానాన్ని పొందు తున్నారు. ప్రతి సంవత్సరం జన్మదిన సందర్భంగా ప్రాథమిక గిరిజన పాఠశాలల్లో విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. బాపన్న జన్మదిన సందర్భంగా మండలంలోని వివిధ ప్రజా సంఘాలు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలిపారు.

