కోమటి చేను సాయి మందిరంలో సత్య సాయి జన్మదినోత్సవం.
![]() |
| సత్యసాయి మందిరంలో 32 మంది సుహాసిని లతో పూజ. |
Scv News Kasipet:--
కాసిపేట మండలం కోమటి చేను గ్రామంలో సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో సత్యసాయి 98వ జన్మదిన ఉత్సవం నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు సత్య సాయి భక్తులు వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ఉదయం ఓంకారము,సుప్రభాతం,నగర సంకీర్తన కార్యక్రమాలతో పాటు 32 మంది సుహాసిని లతో మణిద్వీప వర్ణన పారాయణం, మృత్యుంజయ హోమం పేద మహిళలకు చీరల పంపిణీ, మహా హారతి అన్న ప్రసాదం, దీపాలంకరణ బాలవికాస పిల్లలతో సాంస్కృతిక కళారూపాలు నిర్వహించామని కోమటి చేను సత్యసాయి భజన మండలి నిర్వాహకుడు రామటేంకి రాజలింగు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాపూర్ మంచిర్యాల, మందమర్రి, కొండాపూర్ తదితర ప్రాంతాల నుండి సాయి భక్తులు పాల్గొన్నారు.

