కాసిపేట మండలంలో గడపగడప ప్రచారంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవి

కాసుపేట మండలంలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవి ఎన్నికల ప్రచారం.
![]() |
| కాసిపేట మండల కేంద్రంలో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన శ్రీదేవి. |
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మరాజుల శ్రీదేవి గడపగడప ప్రచారంలోపాల్గొనడం జరిగింది. నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పథకాలను గురించి ప్రజలు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు.తదనంతరం కాసిపేట కోదండ రామాలయంలో దేవస్థానంలో పూజలు నిర్వహించ డం జరిగింది. కాసిపేట మండల కేంద్రంలో బిజెపి కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీదేవి ఆధ్వర్యంలో వందమంది మహిళలు పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాసిపేట మండల అధ్యక్షుడు సంపత్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి దేవునూర్ సంతోష్, మండల ఇంచార్జ్ తిరుపతి, బెల్లంపల్లి అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, కోకన్వీనర్ రాజులాల్ , మండల ఉపాధ్యక్షులు శంకర్, రెడ్డి బాలరాజ్ మండల కార్యదర్శిలు కిరణ్, బాకీ సురేష్, దోమల రామచందర్, మండల కోశాధికారి కృష్ణ,యువమోర్చా అధ్యక్షులు ప్రసన్న, చెప్పకండి విష్ణువర్ధన్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
