ఆదివాసి సేన ఆధ్వర్యంలో బిర్సా ముండా 148వ జయంతి కార్యక్రమం.

కొండాపూర్ గ్రామంలో బిర్సా ముండా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆదివాసి సేన మండల శాఖ.
Scv News Kasipet:--
గిరిజన హక్కుల కోసం పోరాడిన స్వతంత్ర సమరయోధుడు బిర్సా ముండా 148వ జయంతి కార్యక్రమం కాసిపేట మండలం కొండాపూర్ లో మండల ఆదివాసి సేన ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల శాఖ అధ్యక్షుడు మడవి వెంకటేష్, గౌరవాధ్యక్షుడు మడవి గంగారాం వర్కింగ్ ప్రెసిడెంట్ పెందూరు శంకర్, ప్రధాన కార్యదర్శి శిడం గణపతి, ఉపాధ్యక్షులు పెందురు ప్రభాకర్, కోశాధికారి ఆత్రం సంజీవ్, గ్రామ పటేల్ మడవి రామ్ లు బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కమిటీ అధ్యక్షుడు మడా వెంకటేష్ మాట్లాడుతూ బిర్సా ముండా జార్ఖండ్ లో 1875 నవంబర్ 15న జన్మించాడని బ్రిటిష్ ప్రభుత్వ హాయంలో గిరిజనలు జరుగుతున్న దోపిడి పై గిరిజనులతో తిరుగుబాటు చేసి అమరుడయ్యాడని అన్నారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన అమరవీరుడు బీర్సాముండాను గిరిజనులంతా ఎప్పటికీ మర్చిపోవద్దని అన్నారు.