మండల గిరిజన నాయకుడు మాజీ జెడ్పిటిసి మడావి కేశవరావు అనారోగ్యంతో మృతి.

అనారోగ్యంతో మృతి చెందిన మాజీ జడ్పిటిసి మడవి కేశవరావు.
Scv News Kasipet:--
కాసిపేట మండల గిరిజన సంఘ నాయకుడు, ఓరియంట్ దేవాపూర్ కార్మిక నాయకుడిగా పని చేసిన మాజీ జెడ్పిటిసి కేశవరావు ఈరోజు స్వగ్రామంలో అనారోగ్యంతో మృతి చెందాడు. దేవాపూర్ మేజర్ పంచాయతీలోని రాంపూర్ గ్రామానికి చెందిన మండల మాజీ జెడ్పిటిసి సభ్యుడు మడావి కేశవరావు గత 30 సంవత్సరాలుగా గిరిజన సంఘాల నాయకుడిగా దేవపూర్ ఓరియంట్ కార్మిక సంఘ నాయకుడిగా, మండల ప్రజా ప్రతినిధిగా గిరిజనుల, కార్మికుల, మండల ప్రజల వివిధ సమస్యలపై హక్కుల సాధన కోసం ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్నారు. మండలంలో ప్రజా నాయకుడిగా మంచి గుర్తింపును సాధించారు. కేశవరావు దేవాపూర్ పంచాయతీలోని రాంపూర్ నివాసి. ఓరియంట్ కర్మాగారంలో భూమిని కోల్పోయి పర్మినెంట్ ఉద్యోగిగా ఓరియంట్ కర్మాగారంలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో మండల జెడ్ పి టి సి గా ఎన్నికయ్యాడు. ఓరియంట్ కర్మాగారంలో భూ నిర్వాసితుడిగా పర్మినెంట్ కార్మికునిగా పనిచేస్తూ కార్మిక సంఘ నాయకుడిగా కొనసాగాడు. ఓరియంట్ కార్మాగారంలో పనిచేస్తుండగానే గుండె సంబంధిత వ్యాధులు పక్షవాతంతో పనిచేయని స్థితిలో ఉండే కుమారుడికి ఉద్యోగం పెట్టించాడు. గత మూడు సంవత్సరాలుగా పులాజి బాబా ఆధ్యాత్మిక ధ్యాన సమాజంలో పనిచేస్తున్నారు. ఇటీవల అనారోగ్యంకి గురై ఆస్పత్రిలో చే రాడు. వ్యాధి తీవ్రతతో కోమాలోకి వెళ్లి స్వగ్రామంలో మృతి చెందాడు. కేశవరావుకు భార్య కుమారుడు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కేశవరావు మృతి మండల గిరిజన సంఘాలకు తీరని లోటు.