కాసిపేట మండలంలో గురు భూమన్న మహారాజ్ చలో దీక్ష భూమి జాతర విజయవంతం.
Scv News Kasipet:--
సత్య ధర్మ సంస్థాపకుడు బహుజన తాత్విక భక్తి ఉద్యమ తోటపల్లి భూమన్న మహారాజ్ సత్య సంధర్మ సందేశ్ యాత్ర బుధవారం కాసిపేట మండలంలో వివిధ గ్రామాలలో విజయ వంతంగా సాగింది . వివిధ గ్రామంలలోని మండల అంబేద్కర్ వాదుల సమక్షంలో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ధర్మ సందేశాన్ని ప్రజలకు అందించారు. విజయదశమి సందర్భంగా ఈ నెల 24న నాగపూర్ లో బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధన్ని స్వీకరించిన రోజున చలో దీక్ష భూమి జాతరకు చేరుకునేందుకు భూమన్న మహారాజ్ బుధవారం మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా నుండి ఏడు రోజుల బైక్ సత్య ధర్మ సందేశ్ యాత్ర ప్రారంభమైంది . మంచిర్యాల నుండి నాగపూర్ వరకు 18 అక్టోబర్ నుండి 24 వరకు ఏడు రోజులు యాత్ర కొనసాగుతుంది.
ఈరోజు గురు భూమన్న మహారాజ్ దీక్ష భూమి జాతర కాసిపేట మండలం కేంద్రంలోనికి వచ్చిన వెంటనే మండల అంబేద్కర్ సంఘం నాయకులు బన్న లక్ష్మణ్ దాస్, సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య, ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకుడు గోడిసెల సురేందర్, అంబేద్కర్ నాయకులు గో దార్ల శంకర్, అజయ్ లు స్వాగతం పలికారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తదనంతరం ప్రజలను ఉద్దేశించి చలో దీక్ష భూమి జాతర విశేషాలను వివరించారు.
అనంతరం కోమటి చేను గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కు చేరుకొని స్థానిక గ్రామస్తులతో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు.
కొండాపూర్ చౌరస్తా బైక్ ర్యాలీ రావడంతో స్థానిక ప్రజలు మండల అంబేద్కర్ సంఘం నాయకుడు జాడిపోశం, మండల గిరిజన సంఘం నాయకుడు మడావి వెంకటేష్ నాయకులు స్వాగతం పలికారు. కొమురం భీ విగ్రహానికి పూలమాల వేసి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
మల్కాపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు భూమయ్య, అంబేద్కర్ సంఘం నాయకులు శ్రీరాముల రమేష్ స్థానిక ప్రజల సమక్షంలో పూలమాలవేసి గ్రామస్తులకు బౌద్ధధర్మ సందేశాన్ని అందించారు. అదనంతరం వెంకటాపూర్, లక్ష్మీపూర్, సోనాపూర్ సాలే గూడా గట్రావ్ పల్లి గ్రామాలలో ధర్మ సందేశాన్నిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు.
దేవాపూర్ నాయక గూడా లో సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాల వేసి దేవాపూర్ అంబేద్కర్ విగ్రహం వరకు వచ్చారు.
దేవాపూర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అంబేద్కర్ సంఘం నాయకులు వడ్లూరి మల్లేష్, రామిల్ల కిష్టయ్య, కొమ్ముల బాపు, స్వామి, మహేష్, బాపుల సమక్షంలో పూలమాల వేశారు. తదనంతరం అంబేద్కర్ సంఘం నాయకులకు బౌద్ధ ధర్మ సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంలో వివిధ గ్రామాల ప్రజలకు అంబేద్కర్ బౌద్ధాన్ని ఎందుకు స్వీకరించాడు, అశోక విజయదశమి విశేషాలను వివరించారు. బహుజ నుల్లో మానసిక పరివర్తన జరిగినప్పుడే అభివృద్ధి పథంలోకి వస్తామని, ఈ విషయాన్ని గుర్తించి తన జాతి ప్రజల కోసం అంబేద్కర్ బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడని తెలిపారు. బహుజన వర్గాలమంతా బుద్ధుడు బోధించిన బౌద్ధ ధర్మాన్ని తెలుసుకొని ఈ దేశ మూలవాసుల మతమైనా బౌద్ధాన్ని స్వీకరించి, అంబేద్కర్ కలలు కన్నా బౌద్ధ రాజ్యాన్ని స్థాపించాలని కోరారు.








