తాటి గూడెం దిశ మోడల్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలు.
![]() |
| తాటి గూడెం దిశ మోడల్ స్కూలులో విద్యార్థుల బతుకమ్మ ఆట లు |
Scv News Kasipet:--
ప్రభుత్వ పాఠశాలల్లో రేపటినుండి దసరా సెలవుల సందర్భంగా ఈరోజు కాసిపేట మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలతో పాటు తెలంగాణ సాంస్కృతిక పాటలతో విద్యార్థులు ఆటపాటలతో పాఠశాలలో మారుమోగా యి. కొండాపూర్ పంచాయతీలోని దిశా గిరిజన మోడల్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి అంగన్వాడీ టీచర్ రూప ఆధ్వర్యంలో విద్యార్థులు, గ్రామ మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా విద్యార్థులతో పాటలు పాడుతూ బతుకమ్మ వేడుకలు నిర్వహించడం గ్రామస్తులను అలరించాయి.

