గట్రావుపల్లి సోనాపూర్ పంచాయతీలలో విష జ్వరాలతో తల్లడిల్లుతున్న ఆదివాసి కుటుంబాలు.
- విష జ్వరంతో సాలె గూడెంలో సిడం రాంబాయి మృతి.
- 15 రోజుల వ్యవధిలో విష జ్వరాలతో ఇద్దరు మృతి
- రెండు పంచాయతీల్లో పదుల సంఖ్యలో మంచాన పడ్డ ఆదివాసీలు.
- అసంపూర్తిగా గట్రావ్ పెళ్లి ఆరోగ్య ఉప కేంద్రం.
- గిరిజన గూడాల్లో ప్రభుత్వ వైద్య సదుపాయాలు అందక గిరిజనులు అవస్థలు.
![]() |
| విష జ్వరంతో మృతి చెందిన సాలెగూడం గ్రామానికి చెందిన శిడం రాంబాయి. |
![]() |
| విష జ్వరాలతో బాధపడుతున్న సాలెగూడం, సోనాపూర్ గిరిజనులు. |
![]() |
| విష జ్వరాలతో మృతి చెందిన రాంబాయి, దొడ్డి గూడెం గ్రామానికి చెందిన బాలుడు కుడి మేత జలపతి. |
Scv News Kasipet:--
కాసిపేట మండలంలోని సోనాపూర్, ఘట్రావుపల్లి, పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాలలో విష జ్వరాలతో గిరిజనులు తల్లడిల్లి పోతున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో గిరిజనులు విష జ్వరాలతో మంచాన పడి అవస్థలు పడుతున్నారు.
మలేరియా విష జ్వరంతో సాలెగూడం గ్రామానికి చెందిన శిడం రాంబాయి ( 50) బుధవారం మృతి చెందింది. అదే గ్రామంలో పదుల సంఖ్యలో విష జ్వరాలతో మంచాన పడి బాధపడుతున్నారు. కుర్సింగా శారద, చిక్రమ్ శ్రీను, సిడం హనుమంతు, సిడం కృష్ణ, కుడిమేత రాందాస్, విష జ్వరాలతో బాధపడుతూ మంచానపడ్డారు. కురిసింగల్ శారద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సోనాపూర్ లో ఆత్రం బాగు బాయి, ఆర్కా దేవ్ బాయ్, పంద్రం పత్తు బాయి, విష జ్వరాలతో బాధపడుతున్నారు. పెద్దాపూర్ పావు గూడెంలో టేకం రాంబాయి ఆత్రం అనిత, మలేరియా జ్వరంతో బాధపడుతుంది. నాయక్ గూడెం దొడ్డిగూడెం, తుడుం గూడెం జెండా గూడాలలో మలేరియా డెంగు జ్వరాలతో గిరిజనులు బాధపడు తున్నారు.
15 రోజుల క్రితం దొడ్డిగూడెం గ్రామానికి చెందిన కుడిమేత జలపతి అనే బాలుడు విష జ్వరంతో మృతి చెందాడు. ఈ విషయం మీడియాలో రావడంతో బుధవారం మండల విద్యాధికారి రవి కిరణ్ ఆధ్వర్యంలో దొడ్డిగూడెం నాయకపు గూడెం లో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరాలతో బాధపడుతున్న వారికి మందులను పంపిణీ చేశారు. తరువాత గ్రామాలకు వైద్య బృందాలు రావడంలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు. సోనాపూర్ గట్రావ్ పెళ్లి పరిధిలోని గిరిజన గ్రామాలకు వైద్య సదుపాయాలు అందించేందుకు గట్రావు పల్లెలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. భవన నిర్మాణం అధికారుల నిర్లక్ష్యంతో గత 20 ఏళ్లుగా అసంపూర్తిగానే ఉంది. భవనం పూర్తయితే అందులో ఏఎన్ఎం ఉండి వైద్య సేవలందించేది. కోరుతున్నారు. మండల ప్రాథమిక కేంద్ర ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేయాలని గిరిజన సంఘాల నాయకులు ఆత్రం జంగు, గాగృ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర పరిస్థితిపై
![]() |
| గట్రావు పల్లెలో అసంపూర్తిగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం. |
గట్రావు పల్లె సర్పంచ్ పంద్రం రాజు, మాట్లాడుతూ సబ్ సెంటర్ పనులు త్వరలో పూర్తి చేసేందుకు అధికారులతో మాట్లాడతానని అన్నారు.
తుడుం దెబ్బ మాజీ మండల అధ్యక్షుడు ఆత్రం జంగు మాట్లాడుతూ పరిసర గ్రామాల ప్రజలకు సబ్ సెంటర్ పనిచేయకపోవడం వల్ల ఆస్పత్రికి వెళ్లాలంటే దేవాపూర్ వెళ్లాల్సి వస్తుందని అధికారులు చొరవ చూపి మరమత్ పనులు వెంటనే పూర్తి చేయాలని అన్నారు. గట్రావ్ పెళ్లి నుండి మంచిర్యాల వరకు బస్సు సదుపాయం కూడా కల్పించాలని కోరారు. స్థానిక గిరిజన నాయకుడు గాగ్రు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితం నిధులు మంజూరు చేసి సబ్ సెంటర్ పనులు ప్రారంభించారని అన్నారు. ఆదివాసులు అంటే రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులకు అలుసు కావడం వల్ల పనులు పూర్తి చేయడం లేదని విమర్శించారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకొని సబ్ సెంటర్ పనులు పూర్తి చేయాలని కోరారు. సబ్ సెంటర్ పూర్తయితే అందులో ఏఎన్ఎం ఉండడం వల్ల సమీప గ్రామాల ప్రజలు విష జ్వరాల బారిన పడితే చికిత్సకు వీలవుతుందని అన్నారు.





