కాంగ్రెస్ పార్టీలో యాదవ సంఘం జిల్లా నాయకుడు పుర్ర కుమారస్వామి చేరిక .
![]() |
| ముత్యం పెళ్లి గ్రామానికి చెందిన యాదవ సంఘం నాయకులు పుర్ర కుమారస్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిక. |
![]() |
| యాదవ సంఘం జిల్లా నాయకుడు పుర కుమారస్వామి ని ఆ లింగనం చేసుకుంటున్న వినోద్. |
Scv News Kasipet :--
బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి గడ్డం వినోద్ ఈరోజు కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతల ఇండ్లకు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి తమ గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వినోద్ వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రత్నం ప్రదీప్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా యాదవ సంఘం యూత్ అధ్యక్షుడు, మాజీ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకుడు పుర్ర కుమారస్వామి యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముత్యంపల్లి లోని తన స్వగృహం లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 150 మంది యాదవ సంఘం యువకులతో వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా కుమార స్వామి మాట్లాడుతూ నిరుద్యోగ వ్యవస్థను పెంచి పోషిస్తున్న టిఆర్ఎస్ పార్టీని రాబోవు ఎన్నికల్లో ఓడించడమే యువత, నిరుద్యోగుల ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారకురి రామచందర్ ,మాజీ మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రాజమౌళి, రమేష్ ,స్వామి, వెంకటేష్, శంకర్,పుర్ర పోషం తదితరులు పాల్గొన్నారు.

