మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం మాజీ అధ్యక్షుడు వెంగళరావు జయంతి.

 ముత్యంపల్లి గ్రామంలో మాజీ  ఓరియంట్ కార్మిక నాయకుడు వెంగళరావు 68వ జయంతి వేడకలు.

 కార్మిక నాయకుడు వెంగళరావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న కుటుంబ సభ్యులు ప్రజా ప్రతి నిధులు.

 వెంగల్ రావు జయంతి సందర్భంగా పేద వృద్ధ మహిళలకు పండ్లు చీరలు పంపిణీ చేస్తున్న కుటుంబ సభ్యు లు.

Scv News Kasipet :--

 కాసిపేట మండల రాజకీయాలను మూడు దశాబ్దాలకు పై చిలుకు శాసించిన ఓరియంట్ సిమెంట్ గుర్తింపు కార్మిక సంఘం మాజి అధ్యక్షుడు ముత్యం పల్లి మాజీ సర్పంచ్  పూసుకూరి వెంగళరావు 68వ జయంతి కార్యక్రమం ముత్యం పల్లి గ్రామంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నిరుపేద మహిళలకు చీరలు పళ్ళు పంపిని చేశారు.  ముత్యంపల్లి బైపాస్ రోడ్డు లోని వెంగళరావు విగ్రహానికి జడ్ పి టిసి పల్లె చెంద్రయ్య, వైస్ యంపిపి విక్రంరావు, వెంగళరావు కుమార్తె  అరుంధతి లు పులమాలలు వేసి నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా జడ్పిటిసి పల్లె చంద్రయ్య  మాట్లాడుతూ వెంగళరావు కార్మిక నాయకునిగా గ్రామ సర్పంచ్, మండల పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎన్నో సేవలు ప్రజలకు అందించారని అన్నారు. అతని అశాయాలని కొనసాగించాలని కోరారు.అనంతరం వెంగళరావు కూతురు అరుంధతి. విక్రంరావ్ చేతుల మీదుగా ముత్యంపల్లిలోని వృద్ద మహిళ లకు 50మందికి చీరెలు, పండ్లు పంపిణీ చేశారు. 

ఈ కార్యక్రమంలో  ముత్యం పల్లి సర్పంచ్ భాదు,  యంపిటిసి కొండబత్తుల రాంచెందర్, మాజీ జడ్పీటిసి రౌతు సత్తయ్య, బి ఆర్ ఎస్ కార్యదర్శి మోటురి వేణు, ఉప సర్పంచ్ , బోయిని తిరుపతి, కాసిపేట ఉపసర్పంచ్  సుమన్, బి ఆర్ ఎస్, గ్రామ అధ్యక్షులు మద్దేవేని వేణు, ప్రశాంత్, గంగదారి రాజేషం, ఇంతుయాజ్, బొయిని సందీప్, కరీం లు పాల్గొననారు.