మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

పదేండ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి నోచుకోని తుడుం గూడెం గ్రామం.

 

 తుడుం గూడెం గ్రామంలో  శిథిలావస్థకు చేరుకున్న అంతర్గత సి సి  రోడ్డు అవస్థలో   గ్రామస్తులు .

- ప్రధాన రహదారి నుండి గ్రామానికి రోడ్డు లేక ఆదివాసుల కష్టాలు.

- పక్కా ఇల్లు లేక  పూరి గుడిసెల్లో  నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలు.

- ఓరియంట్ కాలుష్యంతో పంటలకు తీవ్ర నష్టం.

- ఓరియంట్ క్వారీ పేలుళ్లతో పగులు తేలుతున్న ఇల్లు.

- గ్రామ చెరువుకు వచ్చే నీటిని మైసమ్మ కుంట కు మళ్ళించుకున్న ఓరియంట్.

-  గ్రామ అభివృద్ధిని,నిరుద్యోగుల ఉపాధిని పట్టించుకోని ఓరియంట్ యాజమాన్యం.

- జీవన భృతికి పింఛన్లు లేక వృద్ధులు, వితంతువులు ఎదురుచూపూలు.

- గ్రామ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని ప్రజాప్రతినిధులు,అధికార పార్టీ నాయకులపై గ్రామస్తుల ఆగ్రహం.

SCV న్యూస్ క్షేత్ర పర్యటన లో వెలుగు చూసిన పచ్చి నిజాలు.

 గట్రావుపల్లి పంచాయతీలోని  తుడుం గూడెం గ్రామస్తులు.

 తుడుం గూడెం గ్రామం, ఇథిలావస్థలోని రహదారి 


Scv News Kasipet :--

 ఆంధ్ర వలసవాద ప్రభుత్వంలో నీళ్లు, నిధులు, నియామకాలలో తీవ్ర అన్యాయం జరిగిందని మన నిధులతో మనమే అభివృద్ధి సాధించుకుంటా మంటూ  ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఊరూరా తెలంగాణ ఉద్యమం ఉదృతంగా సాగి సుమారు 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగా ప్రత్యేక రాష్ట్రము ఆవిర్భవించింది. మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో  సుమారు అయిదు లక్షల కోట్ల అప్పుల పాలైందని కాగ్ రిపోర్టులు, ప్రైవేటు ఏజెన్సీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

ప్రతి ఏటా సుమారు రెండు లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి  పదేళ్ల కాలంలో సగటున 18 లక్షల బడ్జెట్ తో సా గిన పాలనలో గ్రామాలు ఎందుకు అభివృద్ధి కాలేదని నిధులు, నీళ్లు, నియామకాలు ఏమయ్యాయి అని అడిగే తెలంగాణ వాదుల ప్రశ్నలకు పదేళ్లు అధికారంలో ఉన్న ప్రజా ప్రతినిధులు నాయకులు సమాధానం చెప్పాలి. పదేళ్ల తెలంగాణ రాష్ట్రంలో కనీస అభివృద్ధి కూడా సాగలేదని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

కాసిపేట మండలంలోని అన్ని గ్రామాలలో గత పది ఏళ్ల కాలంలో  వందల కోట్ల నిధులు మంజూరు చేసి అన్ని రంగాలలో అభివృద్ధి పరిచామని డంకా బజాయించు కుని ప్రచారం  చేసుకునే అధికార పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధు లు  క్షేత్రస్థాయిలో  గ్రామాల్లో ఏ పార్టీ అభివృద్ధి సాగిందో పరిశీలించాలని మండలవాసులు కోరుతున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల అభివృద్ధి విషయమై తెలుసు కునేందుకు 'Scv News' క్షేత్ర స్థాయి పర్యటనలో విస్తూ పోయే నిజాలు తెలుసాయి.

గత పది ఏళ్ల కాలంలో ఒక్క నయా పైస కూడా తమ గ్రామ అభివృద్ధికి కేటాయించ లేదని తుడుం గూడెం ప్రజలు ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యాన్ని గురిచేస్తుంది.

 తుడుం గూడెం గ్రామం శిధిలవస్థలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో వేసిన సిసి రోడ్డు.

గట్రావ్ పల్లి పంచాయతీ పరిధిలోని తుడుం గూడెం గ్రామం ఉంది. గ్రామంలో గోండు తెగకు  చెందిన 50 కుటుంబాలు నివసిస్తున్నాయి.  రేక్కాడితే కానీ  డొక్క నిండని నిరుపేద కుటుంబాలవి.  దేవాపూర్ ఓరియంట్ సిమెంటు కర్మాగారం వెనుక వైపు క్వారీ స్వమీపంలో గ్రామం ఉంది. వ్యవసాయ భూములన్నీ క్వారీ సమీపంలోనే  ఉన్నాయి. ఓరియంట్ సిమెంట్ కర్మాగారం నుండి వెలువడే సిమెంటు ధూళి పంటలపై  పడడం వల్ల పంటల దిగుబడి తగ్గింది. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న సున్నపురాయి నిలువల భూములను అటవీ  శాఖ ద్వారా యాజమాన్యం సేకరించింది. క్వారీలోని పేలుళ్లతో  వచ్చే ప్రకంపనల వల్ల గ్రామంలోని ఇల్లన్నీ  గోడలు పగుళ్లు తేలుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పడిన ఓరియంట్ సిమెంటు కర్మాగారంలో  క్వారీ ప్రాంతంలో తమ భూములు పోయాయని ఉపాధి కల్పించాలని గ్రామస్తులు ఎన్నోసార్లు ఆందోళనకు దిగారు. గ్రామ సభలను అడ్డుకొని యంత్రాలను కూడా నిలిపి వేసిన సందర్భాలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పోలీసు  అధికారులు  ఉపాధి కల్పిస్తామన్న హామీ హామీగానే మిగిలింది. గ్రామంలో ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్న 30 మంది లో పదిమందికి మాత్రము తాత్కాలిక ఉద్యోగం తీసుకుని ఓరియంట్ యాజమాన్యం చేతులు దులుపుకుందని  గ్రామ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో అటవీ ప్రాంతంలో నుండి గ్రామంలోనికి వచ్చే వాగు నీటితో చెరువు నిండేది. ఈ ప్రాంతం నుండి వచ్చే వాగు నీటిని ఓరియంటి యాజమాన్యం మైసమ్మ చెరువులోకి మళ్ళించడంతో  వాగు నీరు  చెరువులోకి చేరడం లేదని భూగర్భ జలం కూడా ఇంకిపోయి బావుల్లో నీళ్లు లేకుండా పోతున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామ అభివృద్ధిని పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం.

 సోనాపూర్ ప్రధాన రహదారి నుండి గ్రామానికి వెళ్లే కంకర రోడ్డు.

తుడుం గూడెం  గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో వేసిన సిమెంట్ రోడ్డు పగుళ్లు తేలి శిథిలావస్థకు చేరుకుంది. సిసి రోడ్డు కూడా చిన్నగా వేయడం వల్ల, రోడ్డు ఇరువైపులా మొరం వేయక వదిలేశారు. ద్విచక్ర వాహన ము,ఆటో, ఎడ్ల బండి  రోడ్డు దిగితే మళ్ళీ ఎక్కే పరిస్థితి లేక గత పదిహేళ్లుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. రోడ్ వేయకుండా కనీసం ఇరువైపులా మొరం వేయాలని పదేపదే కోరిన ఎవరు పట్టించు కోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోనాపూర్ దేవాపూర్ ప్రధాన రహదారి నుండి సుమారు రెండు కిలోమీటర్లు కంకర తేలిన రోడ్డు పదేళ్ల కింద వేశారు. మధ్యలో  వాగు పైన  రోడ్ డ్యామ్  ఉంది. ప్రతి వర్షకాలం వాగులో ఉధృతంగా నీరు వచ్చి రోడ్ డ్యాం నుండి ప్రవహించడం వల్ల గ్రామస్తులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. గ్రామానికి వచ్చే రహదారిని వంతెనను నిర్మించాలని గత పదిహేళ్లుగా ప్రజాప్రతినిధులను కోరిన పట్టించు కోవడంలేదని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గూడు లేక గిరిజన కుటుంబాల  అవస్థలు.

 పక్కా ఇండ్లు లేక పూరి గుడిసెల్లో ఉంటున్నఆదివాసులు. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లోని పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ల ఇల్లు కట్టిస్తామని అధికారంలోకి వచ్చిన  తెరాస ప్రభుత్వం తమను పట్టించు కోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కట్టిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప తెలంగాణ ప్రభుత్వం ఒక్కటి కట్టించలేదని ఇప్పటికీ  20  ఆదివాసీలు పూరి గుడిసెల్లోనే నివసిస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఇండ్ల నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకున్న మా గ్రామానికి ఇల్లు వస్తాయని నమ్మకం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 పింఛన్ల కోసం ఎదురుచూపులు.

పేద కుటుంబాలకు చెందిన ఆదివాసీలకు ప్రభుత్వ నిబంధనల  ప్రకారం పింఛన్ తీసుకోవడానికి అర్హత ఉన్నా వృద్ధులకు వితంతువులకు పెన్షన్లు రావడంలేదని వాపోతున్నారు. వృద్ధాప్య పెన్షన్ తీసుకోవడానికి 60 ఏళ్ల పై నిండిన పెంద్రం మాధు,   కొమరం భీమ్, సిడం సోము, సేడ్మాక చందు, కుసునాక సోనేరావు, మేశ్రమ్ లచ్చులు ఉన్నారు. గ్రామంలో భర్తలు చనిపోయిన వితంతువులు గావిడే జంగుబాయి, కుమురం జంగుబాయి,  సిడం మోతుబాయిలు ఉన్నారు. పింఛన్ కోసం గత నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకున్న ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 ఎన్నికల సమయంలోనే తమ గ్రామానికి నాయకులొచ్చి ఎన్నో  హామీలు ఇచ్చి ఓట్లు వేసుకుంటున్నారని  తర్వాత తమను మర్చిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గత 10 ఏళ్లలో  తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించలేదని ఒక్క నయా పైసా ఖర్చు చేయలేదని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఇందుకేనా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు నాయకులు తమ గ్రామ అభివృద్ధి పై దృష్టి సారించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.

 ప్రజావాక్కు

 గ్రామ అభివృద్ధిని పట్టించుకోని టిఆర్ఎస్ ప్రభుత్వం.

- సిడం అర్జు వార్డు మెంబర్.


గత పది సంవత్సరాల కాలంగా తెలంగాణ ప్రభుత్వ ఆయంలో తమ గ్రామంలో ఇలాంటి అభివృద్ధి పనులు జరగాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వేసిన గ్రామంలోని అంతర్గత రహదారి గుంతల మాయమైంది. ఇరువైపుల మొరం పోయాలన్న ఎవరు పట్టించుకోవడం లేదు. సోనాపూర్ దాన రహదారి నుండి మా గ్రామానికి బీటి రోడ్డు చేయాలని గత రెండు ఎన్నికల్లో ఎమ్మెల్యేకు చెప్పిన పట్టించుకోలేదు. గ్రామానికి రాలేదు.

 పింఛన్లు ఇవ్వడం లేదు.

 కొమరం భీ.


మా గ్రామంలో వృద్ధులు, వితంతులు పదిమంది వరకు ఉన్న పింఛన్లు ఇవ్వడం లేదు. పింఛన్ కోసం నాలుగేళ్లుగా దరఖాస్తు చేసుకున్న ఎవరు పట్టించుకోవడం లేదు. మా గ్రామానికి ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయడం లేదు.

 మా గ్రామానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు.

 రామ స్వామి.


మా గ్రామంలో ఇల్లు లేని 15 మంది పేదవారు ఉన్నారు. వర్షాకాలంలో వారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కెసిఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చి ఒక ఇల్లు కట్టించలేదు. కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్లలోనే ఉంటున్నాము. సమీపంలోని ఓరియంట్ సిమెంటు దుమ్ము వల్ల పంటలు దెబ్బతిన్నాయి. బ్లాస్టింగ్ ల వల్ల ఇండ్ల గోడలు పగుళ్ళు తేలిన ఎవరు పట్టించుకోవడం లేదు. కంపెనీలో గ్రామస్తులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామన్న హామీ నెరవేర్చడం లేదు.

 ఆడుకునేందుకు ఆట స్థలం లేదు.

 కురిసింగా సాయి.



కెసిఆర్ ప్రభుత్వం ఆడుకునేందుకు వాలీబాల్, క్రికెట్ కిట్లు ఇచ్చిన గ్రామంలో స్థలం లేదు. ఆట స్థలం ఇప్పించాలని కోరిన ఎవరు పట్టించుకోవడం లేదు.