తుడుం దెబ్బ మండల కమిటీ ఎంపిక.
![]() |
| తుడుం దెబ్బ మండల కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన సండ్ర భూమయ్యకు నియామక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా రాష్ట్ర ఆదివాసి సంఘాల నాయకులు. |
Scv News Kasipet:--
కాసిపేట మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల కమిటీ ఎంపిక ఈరోజు దేవాపూర్ మహిళా సమైక్య భవనంలో జరిగింది.
మండల కమిటీ అధ్యక్షుడిగా సండ్ర భూమయ్య, ప్రధాన కార్యదర్శిగా కురిసింగ తిరుపతి, గౌరవ అధ్యక్షుడిగా ఆత్రం జంగులు ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఉపాధ్యక్షులుగా కనక గోవర్ధన్ ఆత్రం మహేష్, రెడ్డి లక్ష్మణ్ రాయ్ సిడం శంకర్, ఆత్రం ప్రశాంత్ మడవి రమేష్ లు, కార్యదర్శులుగా కొడప్ప భీమ్రావు మిశ్రమ రాజకుమార్ మెయిన్రపు రాజయ్య, రోడ్డ అనిల్ మంగ శ్రీకాంత్, వల్క సాయి ప్రశాంత్ లను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శులుగా టేకం భీమ్రావు, లవడం నవీన్, కుడిమేత వసంత్, కురిసింగ మహేష్,మడావి మధుకర్,చిక్రం రాందాస్ లు, సలహాదారులుగా కొమ్ముల బాపు రాయి సిడం రాందాస్, కడప శ్యాంసుందర్, రోడ్ల రవీందర్, తేకం శ్రీనివాస్, గెడమ్ సీతారాంలు ఎన్నికయ్యారు.
మండల కమిటీ ఎన్నిక తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ కార్యదర్శి అడే జంగు, నాయక్ పోడ్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు మడవి వెంకటేష్, ఉపాధ్యక్షుడు కనకరాజు, ఆదివాసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఎడమ కిషన్ లా సమక్షంలో జరిగింది.
