అధికార పార్టీ మంత్రుల పర్యటనతో ప్రతిపక్ష నాయకుల పోలీస్ నిర్బంధం పట్ల నిరసన.
![]() |
| కాసిపేట దేవాపూర్ పోలీసుల అదుపులో ప్రతిపక్ష పార్టీల నాయకులు. |
తెలంగాణ ప్రభుత్వం ఐటి, పురపాలక శాఖ మంత్రి KTR చెన్నూరు నియోజకవర్గం పర్యటనకు వస్తున్నారని ముందస్తు అరెస్టులో భాగంగా కాసిపేట, దేవాపూర్ పోలీసులు ప్రతిపక్ష పార్టీల నాయకులను నిర్బంధించడం పట్ల నిరసన వ్యక్తం అవుతుంది. గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రులు జిల్లాలోని పర్యటనకు వస్తున్న సందర్భాల్లో ప్రతిపక్షాలకు చెందిన మండల స్థాయి నాయకులను నిర్బంధించడం ఆనవాయితీగా మారింది. తెలంగాణ ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలోకి తీసుకు వచ్చామని, ప్రజల మద్దతు మాకే ఉందని ప్రకటించే అధికార పార్టీ నేతలు ప్రజల వద్దకు వచ్చే సమయంలో ప్రతిపక్ష నాయకులను ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వేలాదిమంది పోలీసు బలగాల రక్షణ మధ్య పర్యటించే అధికార పార్టీ మంత్రులను ప్రతిపక్షాలకు చెందిన మామూలు నాయకులు ఎలా అడ్డుకుంటరాని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రతి పక్ష పార్టీలకు చెందిన నాయకులను రోజంతా పోలీస్ స్టేషన్ లో నిర్బంధిం చడం వల్ల వారి కుటుంబాలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను పోలీసు నిర్బంధం చేయడం పట్ల అధికార పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
ఈరోజు మందమర్రి పర్యటనకు కేటీఆర్ వచ్చిన సందర్భంగా కాసిపేట పోలీసులు బిజెపి కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు పోలవేణి పోషంను ను సిపిఎం మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సంఖ్య రవి ని, జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి రత్నం ప్రదీప్ లను నిర్బంధించారు. దేవాపూర్ పోలీస్ స్టేషన్లో మండల బిజెపి ప్రధాన కార్యదర్శి దేవినూరి సంతోష్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు రమేష్ బిజెపి నాయకులు రెడ్డి బాలరాజు సదయ్య రామచందర్ ముందస్తు అరెస్టు చేయడం జరిగింది.
