మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

భారతి జాగృతి ఆధ్వర్యంలోపోలీస్ శాఖకు ఎంపికైన యువతీ యువకులకు సన్మానం .

 భారతి జాగృతి ఆధ్వర్యంలోపోలీస్ శాఖకు ఎంపికైన యువతీ యువకులకు సన్మానం .

 భారత జాగృతి ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు ఎంపికైన మండలంలోని వివిధ గ్రామాల యువకులకు సన్మానం.

Scv News Kasipet :--

భారత జాగృతి కాసిపేట మండల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పోలీస్ శాఖకు ఎంపికైన యువతి యువకులను  సన్మానించడం జరిగింది.  మండలంలోని వివిధ గ్రామాల నుండి పోలీస్ శాఖకు  ఎంపికైన  E శ్రావణి, లింగాల నరేష్, బద్ది శ్రీకాంత్, శివ్ శంకర్, P సురేష్, M అజయ్ కుమార్, K రాజేంద్రప్రసాద్, K అనిల్ కుమార్, A వెంకటేష్, ఏల్పుల  సంతోష్, B వినోద్ కుమార్ 11 మందిని శాలువాలతో  సన్మానించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా  భారత జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు లింగంపల్లి ప్రేమ్ రావు హాజరై నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ రావు మాట్లాడుతూ  సమాజాసేవచేయడానికి ఒక మంచి అవకాశామని దీనిని సద్వినియోగం చేసుకొని సమాజాసేవచేయాలనీ కోరారు. ఇంకా మరెన్నో ఉన్నత తీరాలకు చేరాలని కోరారు ఈ కార్యక్రమం లో కాసిపేట్ మండల అధ్యక్షులు సోదరి సురేష్ బెల్లంపల్లి నియోజకవర్గం కన్వీనర్ రాజకుమార్ మండల మహిళా అధ్యక్షులు గంగ, కో కన్వీనర్ కనక వంశీ కృష్ణ, కాసిపేట జీపీ అధ్యక్షులు రత్నం రాజన్న, కుర్సెంగా వసంత రావు, కుర్సెంగా రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.