ఓరియంటు కర్మాగారంలో పర్మనెంట్ లోడింగ్ కాంట్రాక్టు కార్మికులకు బోనస్ పెంపు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కర్మాగారంలో పర్మనెంట్, కాంట్రాక్టు కార్మికులకు యాజమాన్యం బోనస్ పెంపుదల విషయమై యాజమాన్యానికి గుర్తింపు సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు సమక్షంలో జరిగిన చర్చల్లో ఒప్పందం కుదిరిందని గుర్తింపు కార్మిక సంఘం నాయకులు వడ్లురి మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం యాజమాన్యానికి గుర్తింపు కార్మిక సంఘం నాయకులు లోడింగ్ నాయకులు మధ్య జరిగిన చర్చల్లో పాల్గొన్నారని తెలిపారు.
ఈ సంవత్సరం పర్మనెంట్, లోడింగ్ కార్మికులకు రూ 2,500 పెంచడం జరిగిందని, గతంలోని 32 వేలను కలుపుకొని మొత్తం 34,500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు 600 రూపాయలు గిఫ్ట్ గా ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగింది వారికి ఇస్తున్న కనీస బోనస్ 16,800 కు అదనంగా 600 కలిపి 17,400 వారికి ఇవ్వడానికి ఒప్పందం జరిగింది.ఈ అగ్రిమెంట్ కాలపరమితి ఒక్క సంవత్సరం ఇంతకు ముందు రెండు సంవత్సరాలకు సంబంధించి ఒప్పందం జరిగేది, దానిని ఇప్పుడు సంవత్సరానికి కుదించడం జరిగిందని తెలిపారు.
