మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ధర్మ రావు పేటలో మాజీ ఎంపీపీ రఘుపతిరావు 11వ

 మాజీ ఎంపీపీ  రఘుపతి రావు 11వ వర్థంతి.



Scv News Kasipet:--

 కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామంలోని స్వగ్రామంలో  మాజీ ఎంపీపీ  కొక్కిరాల రఘుపతి రావు  11 వ వర్ధంతి కార్యక్రమం కుటుంబ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో   ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేముల కృష్ణ మాట్లాడుతూ రఘుపతి రావు  ఆశయాలను కొనసాగించాలని,పార్టీలకు అతీతంగా ఆయన ఎంతో మందికి సేవ చేసారనిఅన్నారు. కాసిపేట మండల అభివృద్ధికి ఆయన ఎల్లవేళలా కృషి చేశారని తన పదవి కాలం మొత్తం నీతి నిజాయితీ నిబద్దత విలువలు, క్రమశిక్షణ తో కూడిన రాజకీయాలను చేశారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు సిద్ధం తిరుపతి, ఎంపిటిసిలు పార్వతి మల్లేష్,భీమ్ రావ్,మెరుగు శంకర్ లు,మాజీ సర్పంచ్ లు జాడి శంకర్,ప్రభాత్ రావు,సీనియర్ నాయకులు కన్నాక రాజు,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు కనుకుల రాకేష్,SC సెల్ మండల అధ్యక్షులు గోలేటి స్వామి,మైనార్టీ మండల అధ్యక్షులు శాఖీర్,ఓసిసి కార్మిక నాయకులు అన్నం కుమార్,ఎన్ ఎస్ యు ఐ నాయకులు విద్యాసాగర్ , నాయకులు భారతని సతీష్,కొత్త రమేష్, మైధం రమేష్, చిలుకయ్య,మహంకాళి,శ్రీనివాస్,చారి,వెంకటేష్,ప్రేమ్ కుమార్,ఖదీర్,శివ,రాజు తదితరులు పాల్గొన్నారు.