మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాంగ్రెస్ పార్టీ మద్దిమడ గ్రామ కమిటీ ఎంపిక.

 కాంగ్రెస్ పార్టీ  మద్దిమడ  గ్రామ కమిటీ ఎంపిక.

 మద్దిమాడ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఎన్నికైన నాయకులతో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు వేముల కృష్ణ. 

Scv News Kasipet:--

కాసిపేట మండలంలోని మద్దిమాడ గ్రామ పంచాయతీ లో కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు నియామకం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పరిధిలోని చింతగూడ,మద్దిమాడ గ్రామాల నాయకులు, యువత పాల్గొన్నారు ఈ కమిటీ లో గౌరవ అధ్యక్షులుగా బైర్నేని గోపాల్, గ్రామ కమిటీ అధ్యక్షుడిగా సోమని కిష్టయ్య ను ఎన్నుకున్నారు వీరికి మండల అధ్యక్షుడు వేముల కృష్ణ శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి యంపిటిసి పార్వతి మల్లేష్, సీనియర్ నాయకులు మెరుగు శంకర్, ఓరియంట్ సిమెంట్ కాంట్రాక్టు కార్మికుల అధ్యక్షులు అన్నం కుమార్, ఆదివాసీ నాయకులు కనకరాజు, మైనారిటీ సెల్  షాకీర్,రషిద్, ఖదీర్,ఖలిల్, ఇష్మాయేల్, వేణు, భీం రావ్, అచ్యుత రావు,జంగు, జయరాం,యువ నాయకులు శ్రీనివాస్, సమీర్ లు పాల్గొన్నారు.