మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

M21 ఆధ్వర్యంలో సోనాపూర్ నాయకపు గూడెంలో వాలీబాల్ టోర్నీ .

 M21 ఆధ్వర్యంలో సోనాపూర్ నాయకపు గూడెంలో  వాలీబాల్ టోర్నీ .

 - టోర్నీ విజేతగా నిలిచిన సోనాపూర్ నాయకపు గూడెం జట్టు.

- M 21 లక్ష్యం బహుజన వర్గాలను చైతన్య పరచడమే.

- మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య.

 నాయక గూడెంలో వాలీబాల్ టోర్నీ విజేతలతో ఎం 21 సభ్యులు.






Scv News Kasipet :--

కాసిపేట మండలం ఉమ్మడి సోనాపూర్ పంచాయతీలోని గిరిజన గ్రామాల యువకులకు 21వ శతాబ్దపు జాతీయ బహుజన ఉద్యమ సంస్థ m 21 ఆధ్వర్యంలో శుక్రవారం వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించింది. ఈ టోర్నమెంటులో  సోనాపూర్ గట్రావ్ పల్లె పంచాయతీ పరిధిలోని వివిధ గిరిజన గూడాలకు చెందిన 10 జట్లు పాల్గొన్నాయి. వాలీబాల్ టోర్నమెంటును  m21 రాష్ట్ర కమిటీ సభ్యులు గోషిక  మల్లేష్ నాగేశ్వరరావు, బక్కయ్య, మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు వెంకటస్వామి, కృష్ణ, ప్రజ్యోత్, సాయి, m 21 జిల్లా ప్రచారకుడు కమల్   హాజరై  క్రీడాకారులతో కలిసిm 21 థీమ్  సాంగ్ తో  ప్రారంభించారు. m21 జిల్లా కమిటీ సభ్యుడు మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య, జిల్లా ఆపరేషన్  కమిటీ సభ్యుడు కొమ్ముల బాపు  వాలీబాల్ సర్వీస్ చేసి టోర్నమెంట్ను ప్రారంభిం చారు.గట్రావు పల్లె, సోనాపూర్ నాయకపు గూడెంజట్లు ఫైనల్ కు చేరు కున్నాయి. సాయంత్రం జరిగిన ఫైనల్ పోటీలో  సోనాపూర్ నాయకపు గూడ జట్టు,ఘట్రావు పల్లె జట్టుపై రెండు వరుస సెట్ల లో గెలుపొంది విజేతగా నిలిచింది.


ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో క్రీడాకారులను ఉద్దేశించి  మండల ఇన్చార్జ్ పల్లె మల్లయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించాలని లక్ష్యంతో మ 21 వాలీబాల్ నిర్వహించిందని అన్నారు. 21వ శతాబ్దపు జాతీయ బహుజన ఉద్యమ సంస్థ m 21 రాజకీయాల కతీతంగా బహుజనులను చైతన్య వంతం చేసేందుకు గ్రామాలలో పనిచేసేందుకు ఏర్పాటైన సంస్థ అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు, మహిళలు యువకులు, విద్యార్థులతో కలిసి సమస్యల పరిష్కారం కృషి చేసేందుకు కృషి చేస్తామన్నారు. క్రీడాకారులు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మండల స్థాయి  లో, పంచాయితీల స్థాయిలో వాలీబాల్ ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తామని అన్నారు.


m 21 జిల్లా ఆపరేషన్ టీం సభ్యుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ అంబేద్కర్,పూలే ఆలోచనతో ఏర్పాటైన m21 సంస్థ అంబేద్కర్ భావజాలాన్ని పట్టణాలకు పరిమితం చేయకుండా గ్రామాలలో ప్రజలకు కలిసి పనిచేస్తుందన్నారు. రాజ్యాంగంలో బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు కల్పించిన   హక్కుల గురించి ఆదివాసీలకు వివరిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు.

m 21 మండల కమిటీ సభ్యుడు బద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంత ప్రజలను చైతన్య వంతుల ను చేసి గ్రామాల అభివృద్ధి కోసం ఏర్పాటు అయినటువంటి m21 సంస్థను మండల వాసులందరూ ఆదరించాలన్నారు. యువకులు మార్గాలలో వెళ్లకుండా క్రీడాల వైపు మరల్చేందుకు ఎం 21 వాలీబాల్ పోటీలను నిర్వహించడం అభినంద నీయమని అన్నారు.


స్థానిక గిరిజన నాయకుడు మానుకు మాట్లాడుతూ ఆదివాసి గూడాలను అభివృద్ధి చేసేందుకు యువకులను సక్రమమైన మార్గంలో వెళ్లేందుకు ఏర్పాటు చేసిన M 21 మా గ్రామంలో టోర్నమెంట్ నిర్వహించడం గర్వకారణం అన్నారు. గిరిజన అభివృద్ధి కోసం పని చేసే సంస్థకు గిరిజనుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. తదనంతరం టోర్నీలో విజేతలకు M 21 మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య, జిల్లా కమిటీ సభ్యుడు కొమ్ముల బాపు, సభ్యుడు బద్ది శ్రీనివాస్  స్థానిక గిరిజన నాయకుడు మానుకు, విజేతగా నిలిచిన నాయకపు గూడెం జట్టుకు

షీల్డ్ తో పాటు మూడు వేల నగదు, ద్వితీయ స్థానం పొందిన ఘట్రావు పల్లె జట్టుకు షీల్డ్ తో పాటు రెండు వేల నగదును అందజేశారు.