మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

సాలె గూడెం లో 21వ శతాబ్దపు బహుజన ఉద్యమ( M21) పరిచయ సమావేశం.

 సాలె గూడెం లో  21వ శతాబ్దపు బహుజన ఉద్యమ( M21) పరిచయ సమావేశం.

 సాలె గూడెంలో M 21 పరిచయ సమావేశం లో పాల్గొన్న గ్రామ స్తులు.



Scv News Kasipet:-

 అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా కాసిపేట మండలం సాలె గూడెం గ్రామంలో 21వ శతాబ్దపు పరిచయ సమావేశం జరిగింది. గ్రామస్తులను ఉద్దేశించి M21 భావజాల ప్రచారకులు కమల్, బక్కయ్య లు అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో పనిచేసే ఎం21ఉద్యమ సంస్థ యొక్క ఆశయాలు పనితీరు గురించి వివరించారు. ప్రస్తుతం దేశంలో ఉన్న సమస్యలు బహుజనుల సమస్యలపై వివరించారు. M 21 సంస్థ గ్రామస్థాయిలో బహుజన వర్గాన్ని అంతా ఏకతాటిపై నిలిపి రాజ్యాంగంలో కల్పించిన హక్కుల పై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు పనిచేస్తుందని తెలిపారు.


M 21 జిల్లా ఆపరేషన్ టీం సభ్యుడు కొమ్ముల బాపు మాట్లాడుతూ అంబేద్కర్ ప్రజలందరూ హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా బ్రతకాలని  రాజ్యాంగాన్ని రచించాడు అన్నారు. ప్రజలంతా అజ్ఞానంలో ఉండడం వల్ల రాజ్యాంగంలో కల్పించిన హక్కులు తెలుసుకోలేక పేదరికంలోనే మగ్గుతున్న మన్నారు.


M 21   జిల్లా కమిటీ సభ్యుడు,మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా దేశంలో 85% మెజారిటీ ప్రజలు అణిచివేయబడి పేదరికంలో ఉన్నారని అన్నారు. బహుజన వర్గమంతా  ఏకతాటిపై నిలిపేందుకు 21వ శతాబ్ది ఉద్యమం గ్రామ పునాదుల నుండి నిర్మాణం చేసేందుకు ఏర్పడిన సంస్థ అని అన్నాను. మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసుకొని బహుజన వర్గ చైతన్యం చేసేందుకు పనిచేస్తుందని అన్నారు.


నాయక్ పోడ్  సేవా సంఘం మండలాధ్యక్షుడు బద్ది శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలోని ప్రజానీకాని చైతన్యవంతం చేసి మంచి మార్గంలో పయనించేందుకు ఏం 21 సంస్థ చాలా ఉపయోగ పడుతుందని అన్నారు. యువత చెడు మార్గాలు పయనించకుండా ఇలాంటి సంస్థలు చేరి పని చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయని అన్నారు.


సాలె గూడెం గిరిజన సంఘ నాయకుడు ప్రభాకర్ మాట్లాడుతూ ఎం 21 సంస్థ గిరిజనులను చైతన్యవంతం చేసేందుకు పనిచేయడం మాకు ఆనందంగా ఉందని సంస్థలో చేరి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఏం 21 జిల్లా కమిటీ సభ్యుడు సాంబయ్య, స్థానిక గిరిజన సంఘాల నాయకులు శేఖర్, కృష్ణ, శ్రీనివాస్ మహిళా సంఘం నాయకురాలు పార్వతి బాయి స్థానిక గిరిజనులు విద్యార్థులు పాల్గొన్నారు.