మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట గని పై రక్షణ పక్షోత్సవాలు.

 కాసిపేట గని పైన ఘనంగా రక్షణ  పక్షోత్సవాలు. 

- రక్షణ తో కూడిన ఉత్పత్తిని తీయాలి,

- ప్రమాదరహితంగా  ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలి. 

-కన్వీనర్ నాగేశ్వరరావు

 హాలేజీ విభాగంలో సింగరేణి స్థాయిలో ప్రథమ బహుమతి గెలుచుకున్న కాసిపేట గనికి బహుమతి అందజేస్తున్న సేఫ్టీ కన్వీనర్ నాగేశ్వరరావు.

Scv News Kasipet:--

కాసిపేట గని పైన ఘనంగా 54వ రక్షణ పక్షోస్తావాల ప్రారంభమైనాయి.రక్షణ తనిఖీ కమిటీని ఉద్యోగులు ప్రధాన ద్వారం నుండి బైక్ ర్యాలీ గా (త్రివర్ణ పతాకం) జాతీయ జండా,రక్షణ జండా తో ర్యాలీ నిర్వహించి బాణసంచా లను కాల్చడం జరిగింది.అనంతరం కమిటీ సభ్యులకు స్వాగతం పలికి వారిని బాజా బజంత్రీలతో  వేదిక వద్దకు ఆహ్వానించారు.

 కన్వీనర్ జి. నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ  ఉద్యోగులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు ,గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. హెల్మెన్ట్ వాడుక పోవడం వల్ల ప్రమాదాల బారిన పడి విలువైన జీవితాన్ని మధ్యలోనే ముగిస్తున్నారు. దీని వల్ల కుటుంబాలు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడి ప్రాణాలు కాపాడుకొని దేశ సేవలో భాగస్వామ్యం కావాలని అన్నారు.చిన్న వయస్సు లొనే గుండె సంబంధిత వ్యాధులు లోనై చనిపోవడం జరుగుతుంది. సరైన ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసు కోవాలి, వయాయం చెయడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు నుండి రక్షణ పొందవచ్చు అని అన్నారు. అలాగే రక్షణ తో కూడిన ఉత్పత్తి చేయాలని,ప్రమాదాల బారిన పడకుండా జీవితాన్ని గడపాలని అన్నారు.అనంతరం ఇంచార్జి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రక్షణ జీవితం లో ఒక భాగం కావాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  కె కె గ్రూపు ఏజెంట్ రామ దాసు,మేనేజర్ అల్లావుద్దీన్, ఏరియా రక్షణ అధికారి రవీందర్,రక్షణ అధికారి సునీల్ ,ఏరియా ఇంజనీర్ రాం ప్రసాద్,తనిఖీ బృందం ప్రవీణ్ విక్రమ్,సాయి నాథ్, శ్రీనివాసులు, ప్రదీప్ కుమార్,జయంత్ కుమార్,తిరుపతి,వర్క్ మెన్ ఇన్స్పెక్టర్స్, ఫిట్ సెక్రెటరీ లు బైరి శంకర్,మీనుగు లక్ష్మినారాయణ, ఏరియా నాయకులు ఓడ్నిల రాజన్న,దేవి భూమయ్య,సోల్లంకి శ్రీనివాస్,ఫిట్ సేఫ్టీ కమిటీ సభ్యులు,అండర్ మేనేజర్ నికి,వెంకటేష్,వంశీ కృష్ణ,దిలీప్ కుమార్,సంక్షేమ అధికారి మీర్జా గౌస్ జీషా,సర్వేయర్ వెంకటేశ్వర రావు,ఖాన్, ఇంజనీర్లు బాబు,మదుకర్,బన్న లక్ష్మన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.

ఉత్తమ ప్రతిభకారబర్చిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగుల కు జనరల్ మేనేజర్,SO టు డైరెక్టర్ జి. నాగేశ్వరరావు, ఇంచార్జి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి,ఏజెంట్ రామదాసు గార్ల చేతుల మీదుగా కాసిపేట గని సింగరేణి స్థాయిలో మొదటి బహుమతి హాలేజీ విభాగం లో,మరో మొదటి బహుమతి సేఫ్టీ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP) విభాగంలో ట్రాపిని  మేనేజర్ అల్లావుద్దీన్, SO సునీల్,ఫిట్ కమిటీ అందుకున్నారు. కోల్ కట్టింగ్ లో మొదటి బహుమతి ని B రిలే కోల్ కట్టర్లు పవన్ రాజ్,సంతోష్,సంపత్, శ్రీనివాస్,వెంకటేష్,సపోర్టింగ్ లో A రిలే సపోర్ట్ మేన్స్ దేవయ్య,సమ్మయ్య,శ్రీనివాస్,మైనింగ్ విభాగంలో ప్రశాంత్ లు బహుమతులు అందుకున్నారు.