గట్రావు పల్లె పంచాయతీలో క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ.

కట్రావుపల్లి పంచాయతీ కార్యాలయంలో వాలీబాల్ క్రికెట్ కిట్లు పంపిణీ చేస్తున్న గ్రామ సర్పంచ్ పంద్రం రాజు.
Scv News Kasipet:--
కాసిపేట మండలం గట్రావ్ పెళ్లి పంచాయితీ కార్యాలయంలో పంచాయతీ పరిధిలోని గ్రామాల యువకులకు గ్రామ సర్పంచ్ పంద్రం రాజు క్రికెట్, వాలీబాల్ కిట్ల పంపిణీ చేశారు. సాలెగూడం గుండుగూడెం వర్షపాలి రేకులగూడెం ఇప్పల గూడెం తుడుం గూడెం గ్రామాల యువకులకు క్రికెట్ డంబుల్స్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెంద్రం రాజు మాట్లాడుతూ గ్రామంలోని యువకులకు కెసిఆర్ ప్రభుత్వం క్రీడా పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమని అన్నారు. గిరిజన నాయకుడు పెంద్రం ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల్లోని యువత చెడు తిరుగులు తిరగకుండా ఆటలపై దృష్టి పెట్టేందుకు కేసిఆర్ ప్రభుత్వం క్రీడా పరికరాలు అందజేయడం ఆనందదాయకంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వి తనుజ, గ్రామ పటేల్ అర్క్ జైతూ, గిరిజన యూత్ నాయకులు పెంద్రం ప్రభాకర్, శ్రీనివాస్, భీమ్రావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.