మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుడిగాలి పర్యటన.

 కాసిపేట మండలంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుడిగాలి పర్యటన.

-- సుమారు నాలుగు కోట్ల వ్యయం చేసే గ్రామపంచాయతీ భవనాలకు, మహిళా సమాఖ్య భవనాలకు, సీసీ రోడ్లకు భూమి పూజలు.

 ధర్మ రావు పేటలో పంచాయతీ భవన భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.



Scv News Kasipet :--

 రాష్ట్రంలో అసెంబ్లీ  ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో వస్తుండడంతో కాసిపేట మండలంలో  హడావుడిగా  బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే  దుర్గం చిన్న య్యచేశారు. మండలంలోని వివిధ గ్రామంలో ఉదయం నుండి సాయంత్రం వరకు  సుడిగాలి పర్యటన చేసి వివిధ గ్రామపంచాయతీలో సుమారు నాలుగు కోట్ల పైచిలుకు నిధుల అంచనాలతో  నూతన పంచాయతీ భవనాలకు, మహిళా సంఘాల భవనాలకు సిసి రోడ్లకు భూమి పూజలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో తమను గెలిపిస్తే   మండలాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తా నాని మండల ప్రజలకు హామీ ఇచ్చారు.

 కాసిపెట్ మండలంలోని వివిధ గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటన, భూమి పూజల  వివరాలు ఇలా ఉన్నాయి.  - 

- పెద్దనపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు పనులకు, మామిడిగుడెం గ్రామంలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న BT రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

- కాసిపెట్ లోని సండ్రలపాడ్ గ్రామంలో 14 లక్షల రూపాయలతో నూతన సిసి రోడ్ పనులకు,ముత్యం పెళ్లి  గ్రామంలో 18 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవన్ మరియు 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కోమటిచేను గ్రామంలో  18 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవన్ మరియు 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన మరియు 10 లక్షల రూపాయలతోసిసి రోడ్ పనులకు భూమి పూజ చేశారు.

 కొనుర్ లో  10 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులకు, లంబడితండా(D) గ్రామంలో 20 లక్షల రూపాయలతో  గ్రామ పంచాయతీ భవన మరియు 16 లక్షల రూపాయలతో సిసి రోడ్ పనులకు భూమి పూజ చేశారు. ధర్మారావుపేట గ్రామంలో 18 లక్షల రూపాయలతో మహిళా సమాఖ్య భవన్ మరియు 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వెంకటాపూర్ పంచాయతీలో కూపర్ లింగు స్వామి ఆలయంలో పది లక్షలతో నిర్మించబోయే షెడ్ కు భూమి పూజ చేశారు.

 పల్లం గూడెం పంచాయతీ లో పంచాయతీ భవన నిర్మాణం కోసం పాఠశాల ఆట స్థలంలో  భూమి కేటాయించడాన్ని స్థానికులు వ్యతిరేకించారు. ఎమ్మెల్యే నూతన పంచాయతీ భవనంకు భూమి పూజ చేయలేదు. మహిళా సమైక్య భవనానికి సిసి రోడ్లకు మాత్రమే భూమి పూజ చేశారు.

బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య మండల పర్యటనలో ఆయన వెంట ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి  పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రం రావు, బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మంజుల రెడ్డి,అప్పల శేఖర్, మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి,ప్రధాన కార్యదర్శి మోటూరు వేణు వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.