మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

ప్రోటో కాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్.

 ప్రోటో కాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి.

-- అధికారం శాస్వతం కాదు బి ఆర్ స్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ హెచ్చరిక. 

 కాసిపేట ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడుతున్న మండల కాంగ్రెస్ నాయకులు.


 ప్రోటోకాల్ పాటించిన అధికారులపై చర్య తీసుకోవాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్న మండల కాంగ్రెస్ నాయకులు.



Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఆదివారం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సుడిగాలి పర్యటన చేసి  కోట్లాది రూపాయల విలువ గల  గ్రామపంచాయతీ భవనాలు, సమైక్య భవనాలు సిసి రోడ్లకు భూమి పూజ చేసిన   సందర్భంలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానించక పోవడంపై  కాంగ్రెస్ పార్టీ  నాయకులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనిపై ఈరోజు కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేముల కృష్ణ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల కృష్ణ మాట్లాడుతూ చట్టబద్ధంగా ఎన్నికైన ప్రజా ప్రజాప్రతినిధులకు సమాచారం లేకుండా అభివృద్ధి పనులను బా.రా.స  నాయకులతో కలిసి శంకుస్థాపన చేయడం సిగ్గు చేటని, ప్రజాప్రతినిధులను అవమానించిన అధికారులకు,ఎమ్మెల్యేకు ప్రజలే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని అన్నారు. ప్రోటోకాల్ పాటించని అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారికి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.  ప్రజలను పక్కదోవ పట్టించేందుకే, శంకుస్థాపన పేరిట హడావిడి చేస్తున్నారని, పనులు పూర్తిచేశాకే గ్రామాల్లో ఓట్లు అడగాలని అన్నారు. రానున్న ఎన్నికల్లో భారాస ఎమ్మెల్యేలకు ప్రజలే గుణపాఠం చెప్తారని వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. 

సర్పంచి అప్పని స్వరూప మాట్లాడుతూ.. ప్రభుత్వం గ్రామపంచాయతీలకు కేటాయించిన నిధులను సర్పంచ్లకు తెలియకుండా శంకుస్థాపన చేయడం సబబు కాదని, దీన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని,  ప్రోటోకాల్ పాటించని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపిటిసిలు పార్వతి మల్లేష్, భీమ్ రావు, మాజీ మండలాధ్యక్షులు తిరుపతి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు  స్వామి, మైనార్టీ సెల్  మండల అధ్యక్షులు షాకిర్, సీనియర్ నాయకులు, అప్పని శ్రీనివాస్, మైదం రమేష్, జాడి శివ, మహాకాళి ,వార్డు సభ్యులు పంబాల తిరుపతి, సుద్దపెల్లిమొగిళి,జంపయ్య,విజయ్,యూత్ కాంగ్రెస్ నాయకులు మహేష్, నవీన్, ప్రేమ్ కుమార్,లు పాల్గొన్నారు.