మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ లో గ్రూపు తగాదాలతో గందరగోళం.

 కాంగ్రెస్ పార్టీలోని రెండు వర్గాల ప్రచారంతో కాంగ్రెస్ కార్యకర్తలు, సానుభూతి పరులు అయోమయం.

కాంగ్రెస్ పట్ల ప్రజల ఆదరణ పెరిగిన వర్గాల కుమ్ములాటతో పార్టీకి తీవ్ర నష్టం.

- కాంగ్రెస్ అధిష్టానం వినోద్ కు బీఫామ్ ఇచ్చిన క్యాడర్ ను ప్రచారానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్న ప్రేమ్ సాగర్ రావు

.బిఆర్ఎస్ అసమ్మతినేతలు కాంగ్రెస్ లోకి వస్తున్నారనే ప్రచారంతో  ప్రేమ్ సాగర్రావు  కాంగ్రెస్ వర్గ నాయకులకు షాక్.

-  కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం  ప్రేమ్ సాగర్ వర్గాన్ని వీడి వినోద్ వర్గంలో జారుకుంటున్న మండల నాయకులు.

- మండల కాంగ్రెస్ రాజకీయాలపై Scv News  అందిస్తున్న ప్రత్యేక కథనం...

 కాసిపేట మండలంలో వినోద్ పర్యటనలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులు.

 బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పాదయాత్రలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు (పాత చిత్రం )


Scv News Kasipet:--

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత తెరాస పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చి కూడా తెలంగాణను అభివృద్ధి చేయడంలో, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తీవ్ర వైఫల్యం చెందిందని ప్రభుత్వంపై  తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన  సోనియా గాంధీ ప్రత్యేక శ్రద్ధ కారణమని తెలంగాణ ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ఈసారి ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆలోచన ఉండడంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుంది. మరోవై పు కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు వర్గ విభేదాలే ప్రజలను కార్యకర్తలను అయోమయంలోకి నెట్టివేస్తున్నాయి.

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో రోజురోజుకు గ్రూపు తగాదాలు పెరిగి పోతున్నా యి.మంచిర్యాల,చెన్నూరు,బెల్లంపల్లి, నియోజకవర్గాలపై ప్రేమ్ సాగర్ రావు ఆధిపత్యాన్ని కాంగ్రెస్ లోని మరొక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్ లోని  ప్రేమ్ సాగర్ రావు వర్గం తన పట్టును నిలుపుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అంతే స్థాయిలో అతని వ్యతిరేకవర్గం వినోద్ నాయకత్వంలో పనిచేస్తుంది.కాంగ్రెస్ అధిష్టాన వర్గం రెండు వర్గాలను సమన్వయం చేయడంలో ఘోరంగా విఫలమైందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .  మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ పనిచేస్తుంది. గత సంవత్సరం సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గంలోని 6 మండలాలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా తన వర్గం వారిని నియమించుకుంది. దీన్ని వ్యతిరేకిస్తూ వివేకవర్గం రాష్ట్ర అధిష్టాన ఆదేశాల వరకు ఆరు  మండలాలకు తన వర్గంలోని నాయకులను మండల అధ్యక్షులుగా నియమించుకుని  కొంత కాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.వివేక్ వర్గం  నియామకాలు చెల్లవని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ ప్రకటన చేసింది. రాష్ట్ర ఆదేశాల మేరకు ఆ నియామకాల రద్దు చేస్తామని  ప్రకటించి నెలలు గడుస్తున్న రద్దు కాకుండా నియోజకవర్గంలో రెండు మండల కమిటీలు పనిచేస్తున్నాయి. ఏ వర్గంలో పనిచేయాలో నిజాయితీ గా కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు, సానుభూతిపరులు అయోమయానికి గురి అవుతున్నారు.

ఈలోగా రాష్ట్ర ఎన్నికల ప్రకటన వెలువడింది. బెల్లంపల్లి నియోజక వర్గంలో వినోద్ టికెట్టు ఆశిస్తున్నాడని తెలుసుకొని అతనికి చెక్ పెట్టేందుకు ప్రేమ్ సాగర్ రావు  స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే వాదన తెచ్చాడు.

స్థానికులకే బెల్లంపల్లి నియోజకవర్గ టికెట్ ఇవ్వాలని పాదయాత్ర చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు వర్గం నాయకులు.
 (పాత చిత్రం)

తన వర్గ నాయకులతో  కాసిపేట మండలం నుండి వేమనపల్లి వరకు నియోజకవర్గ వ్యాప్తంగా పాదయాత్రలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రేమ్ సాగర్ రావు పిలుపుకు స్పందించి   ఆయన వర్గాల నాయకులు, కార్యకర్తలు సుమారు నెలరోజుల పాటు నియోజకవర్గంలోని గ్రామాలలో పాదయాత్రలు నిర్వహించారు. స్థానిక అభ్యర్థికి టికెట్ ఇవ్వాలని అది రాష్ట్ర అధిష్టాన వర్గానికి  ఫిర్యాదు చేశారు. అధిష్టాన వర్గం ప్రేమ్ సాగర్ రావు  ఫిర్యాదులను ఒత్తిడి లను పట్టించుకోకుండా వినోద్ అభ్యర్థిత్వాన్నిఖరారు చేస్తూ బీఫామ్ కూడా అందజేసింది. దీంతో ప్రేమ్ సాగర్ రావు ను నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలు షాకుకు గురై దిక్కుతో చని పరిస్థితికి నెట్టబడ్డారు.

 రాష్ట్ర అధిష్టాన వైఫల్యంతో కాంగ్రెస్ క్యాడర్లో అయోమయం.

 ప్రేమ్ సాగర్ రావు వినోద్ ల మధ్య సయోధ్య కుదుర్చటంలో రాష్ట్ర అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందనే విమర్శలు సర్వాత్ర వ్యక్తం అవుతున్నాయి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిలు ఇద్దరు నాయకులను  కూర్చుండబెట్టి వారి మధ్య రాజి  కుదుర్చుక పోవడంతో ఎన్నికల సమయంలో ఎవరి వైపు ప్రచారం చేయలో తోచక కాంగ్రెస్  నాయకులు,కార్యకర్తలు అయోమ యంలో పడ్డారు.

ప్రేమ్ సాగర్ రావు తన వర్గ నాయకులకు పార్టీ టికెట్  ఇప్పించ డంలో విఫలం కావడం అతనిని నమ్ముకుని పాదయాత్ర లు చేసిన నాయకులను తీవ్ర నిరాశలో ముంచింది. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం బెల్లంపల్లి నియోజకవర్గంలో  వినోద్ గెలుస్తాడని నమ్మి బీఫాము అందజేసింది. ప్రేమ్ సాగర్ రావు పార్టీ విజయం కోసం అధిష్టాన ఆదేశాలను శిరసావ హించి  క్రమశిక్షణ గల కాంగ్రెస్ నాయకుడిగా వ్యవహరిస్తూ  బీఫామ్ అందుకున్న వినోద్ కు   మద్దతు ఇవ్వాల్సి వుంది. తమ మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలను పార్టీలోకి తెచ్చి తన పంతం నెగ్గించుకునేందుకు ప్రచారానికి దూరం ఉండాలని తన క్యాడర్ను ప్రేమ్ సాగర్రా వు ఆదేశించడం పట్ల కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరసన లు వ్యక్తం అవు తున్నాయి.  బెల్లంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో వినోద్ తిరుగుతున్న ప్రేమ్ సాగర్ వర్గ క్యాడర్ వినోద్ ప్రచారంలో పాల్గొనకుండా ఇంకా నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుల గ్రూప్ తగాదాలను బారాస నాయకులు అనుకూలంగా మార్చుకొని ప్రచారం చేసుకుంటున్నారు.

 టిఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తూ చాలు ఒక కప్పుతున్న డిసిసి అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ.(పాత చిత్రం)

కాసిపేట మండలంలో  గత కొంతకాలంలో మండల కాంగ్రెస్ లో రెండు వర్గాల మండల కమిటీలు పనిచేస్తున్నాయి. వినోద్ వర్గ మండల కమిటీకి రత్నం ప్రదీప్ మండల అధ్యక్షుడిగా వ్యవహరి స్తుండగా, ప్రేమ్ సాగర్ వర్గ మండల కాంగ్రెస్ కమిటీకి వేముల కృష్ణ అధ్యక్షత వహిస్తున్నారు. రెండు కమిటీలు వేరువేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం కాంగ్రెస్ కార్యకర్తలను, పార్టీ సానుభూతిపరు లను అయోమయంలోకి నెట్టుతుంది.

ప్రేమ్ సాగర్ రావు వర్గం తనకు సహకరించకపోవడంతో  వినోద్ వర్గం నాయకులు  రాజకీయ వ్యూహంలో భాగంగా మండలంలో ని అసమ్మతిలో ఉన్న  బీఆర్ఎస్  నాయకులను తీసుకునే ప్రయత్నాలు జరుగు తున్నాయి. బిఆర్ఎస్ అసమ్మతి నాయకులు కాంగ్రెస్  పార్టీలో చేరి  ఆధిపత్యం చెలాయిస్తే  పార్టీని నమ్ముకున్న తమ పరిస్థితి ఏమిటని  ఇన్నాళ్లు ప్రేమ్ సాగర్ రావు నమ్ముకున్న క్యాడర్  ఆందోళనకు గురవుతుంది. తాము కాంగ్రెస్ను పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నామని  గత ఎన్నికల్లో ఏనుగు గుర్తుపై పోటీ చేసిన వినోద్ దగ్గర డబ్బులు తీసుకుని ఇప్పటి బి ఆర్ ఎస్ అసమ్మతి నేతలు దుర్గం చిన్నయ్యకు ఓటు వేసి గెలిపించారాని, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలవకుండా  కుట్రలు చేస్తున్నారని తమను పిలిచి మాట్లాడితే మేము సహకరిస్తా మంటూ ప్రేమ్ సాగర్ రావు వర్గ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేముల కృష్ణ ఒక మెట్టు దిగివచ్చి  ఇటీవల మీడియాతో మాట్లాడడం గమనర్హం. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రేమ్ సాగర్ రావు వర్గంలోని కొంతమంది నాయకులు అదిస్థాన వర్గం నుండి బీఫామ్ తెచ్చుకున్న వినోద్ వర్గానికి ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారు.


ఆదివారం కాసిపేట మండలంలో పర్యటించిన వినోద్ వెంట ప్రేమ్ సాగర్ వర్గంలోని మాజీ మండల పార్టీ అధ్యక్షులు సిద్ధం తిరుపతి, మైదం రమేష్ తో పాటు మరి కొంతమంది ప్రచారంలోకి దిగారు. కాసిపేట గ్రామంలోని జిల్లా యాదవ సంఘం నాయకుడు పుర్ర కుమార స్వామి తో పాటు మరికొంతమంది యువకులను పార్టీలో చేర్చుకుంటూ రోజురోజుకు బలోపేతం అవుతు న్నారు. 

 ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధిష్టాన వర్గం చొరవ చూపి ప్రేమ్ సాగర్ రావు వినోదుల మధ్య  సయోధ్య కుర్చీ ఏకధాటిపై ప్రచారం చేస్తేనే నియోజకవర్గ ఎమ్మెల్యే  గేలిచే అవకాశాలు ఉన్నాయి. గత ఎన్నికలలో మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ నాయకులు కోవర్టులుగా  మారితే  గత ఎన్నికల ఫలితాలు వస్తాయని  నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.