కాసిపేట మండలంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు.
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో గాంధీ జయంతి వేడుకలు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థ సభ్యులు ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.
ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రోడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీడీవో ఎంఏ అలీ , ఎంపీటీసీ అక్కేపల్లి లక్ష్మి, కో ఆప్షన్ సభ్యులు సిరాజ్ ఖాన్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ధర్మ రావు పేటలో బెల్లంపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులా రెడ్డి, ఎంపిటిసి పార్వతి మల్లేష్ పంచాయతీ సిబ్బంది గాంధీ చిత్రపటానికి పూలమాల వేశారు.
మల్కపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మల్కపెల్లి యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూత్ అధ్యక్షుడు శ్రీరాముల రమేష్ పాఠశాల ఉపాధ్యాయ బృందం గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీ దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల సాయి కిరణ్ గౌడ్, చరణ్ గౌడ్, దేవసాని మధుకర్, కుడిమేత కర్ణ సాయి, అంకం అభినయ్ శ్రీరాముల వెంకటేష్ గౌతం ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కాసిపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మండల పరిషత్ ఉపాధ్యక్షుడు విక్రమ్ రావు, ఎంపీటీసీ అక్క పెళ్లి లక్ష్మి గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.




