మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో సత్య ధర్మ సందేశ్ యాత్ర.

 కాసిపేట మండలంలో సత్య ధర్మ సందేశ్ యాత్రను విజయవంతం చేయండి.



Scv News Kasipet:--

 సత్య ధర్మ సంస్థాపకుడు బహుజన తాత్విక భక్తి ఉద్యమ  తోటపల్లి భూమన్న మహారాజ్ సత్య సంధర్మ సందేశ్ యాత్ర బుధవారం కాసిపేట మండలంలో జరగనుంది. విజయ దశమి సందర్భంగా ఈ నెల 24న నాగపూర్ లో  బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధన్ని స్వీకరించిన రోజున చలో దీక్ష భూమి జాతరకు చేరుకు నేందుకు  భూమన్న మహారాజ్ బుధవారం మంచిర్యాల అంబేద్కర్ చౌరస్తా  నుండి ఏడు రోజుల బైక్ సత్య ధర్మ సందేశ్ యాత్ర ప్రారంభ మవుతుంది. మంచిర్యాల నుండి నాగపూర్ వరకు 18 అక్టోబర్ నుండి 24 వరకు ఏడు రోజులు యాత్ర కొనసాగుతుంది. మంచిరాల,కొమరం భీం జిల్లా నుండి మహారాష్ట్రలో ప్రవేశించి నాగపూర్ కు చేరుకుంటుంది. మధ్యలో ఈ జిల్లాలోని అన్ని గ్రామాలలో బౌద్ధ ధర్మ ప్రచారం చేసుకుంటూ యాత్ర కొనసాగుతుంది. కాసిపేట మండలంలో బుధవారం  మధ్యాహ్నం ప్రవేశించి వివిధ గ్రామాల గుండా ప్రచారం చేసుకుంటూ సాయంత్రం దేవాపూర్ లో విడిది చేయడం జరుగుతుంది. అంబేద్కర్ విగ్రహాలున్న కాసిపేట, కోమటి చేను , మల్కపెల్లి దేవాపూర్ గ్రామాలలోని అంబేద్కర్ వాదులు సత్య ధర్మ సందేశ్ యాత్ర చేస్తున్న భూమన్న మహారాజ్ కార్యక్రమంలో విజయవంతం చేయ గలరు. మండలంలోని బహుజనవర్గాల యువకులు బుద్ధిస్టులు అంబేద్కర్ వాదులు  భూమన్నయాత్రను  స్వాగతం పలికి విజయవంతం చేయగలరని మండల అంబేద్కర్ సంఘం నాయకులు కోరుతున్నారు.