మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో మాదిగల విశ్వరూప పోస్టర్ విడుదల

 మాదిగల విశ్వరూప మహా ప్రదర్శన పోస్టర్ విడుదల.

 దేవాపూర్ లో మాదిగల విశ్వరూపం మహాపాద దర్శన పోస్టర్ విడుదల చేస్తున్న దండోరా నాయకులు.




Scv News Kasipet:--

 కాసిపేట మండలం దేవాపూర్  అంబేద్కర్ భవన్ వద్ద  ఈరోజు మాదిగ దండోరా మండల కమిటీ ఆధ్వర్యంలో దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు  మంద కృష్ణ మాదిగ చేపట్టిన పాదయాత్ర మాదిగల విశ్వరూప మహా ప్రదర్శన గోడ ప్రతిని విడుదల చేశారు. అక్టోబర్ 7న అలంపూర్ లో ప్రారంభమై పాదయాత్ర నవంబర్ 4 న హైదరాబాదులో ముగుస్తుంది. పాదయాత్రలో  పెద్ద ఎత్తున మాదిగలంతా పాల్గొనాలని మాదిగ దండోరా జిల్లా కార్యదర్శి ప్రశాంత్, మండల కన్వీనర్ పంగ లచ్చయ్య పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ దండోరా నాయకులతోపాటు నాయాక్ పోడ్  సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు.