మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల బిఆర్ఎస్ పార్టీ కంచుకోటకు బీటలు?

 

కాసిపేట మండల బిఆర్ఎస్ పార్టీ కంచుకోటకు బీటలు?

మాజి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండల పార్టీ అధ్యక్షుడు  రమణారెడ్డి  నిరంకుశ వైఖరికి నిరసనగా మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు తిరుగుబాటు? 

- వీరిని బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ నేత, ఓరియంట్  గుర్తింపు అధ్యక్షుడు రామ్మోహన్ రావు.

-  ససేమిరా అంటున్న అసమ్మతినేతలు, కొద్ది రోజులు వేచి చూసేందుకు అవకాశాలు.

 మండల టిఆర్ఎస్ రాజకీయాలపై scv News ప్రత్యేక కథనం... 

 కాజీపేట మండల టిఆర్ఎస్ అసమ్మతి నేత విక్రమ్ రావుతో చర్చలు జరుపుతున్న నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ నేత ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావు.

 కాసిపేట మండల పర్యటనలో ఎమ్మెల్యే వెంట ఉన్న అసమ్మతినేతలు (పాత చిత్రం)


SCV News Kasipet:--

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాసిపేట మండల రాజకీయాలు  శరవేగంగా మారుతున్నాయి. గత పదేళ్లుగా  బిఆర్ఎస్ పార్టీ కంచుకోటగా ఉన్న మండలంలో అసమ్మతి సెగలు రగులుతున్నాయి. మండలంలోని వైస్ ఎంపీపీ విక్రమ్ రావు నాయకత్వంలో  ఎంపీపీ రోడ్డ లక్ష్మి, జడ్పిటిసి పల్లె చంద్రయ్య ఓరియంట్ గుర్తింపు కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరెడ్డితో పాటు పలువురు  ఎంపీటీసీలు సర్పంచులు గత కొంతకాలంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి ల నిరంకుశ వైఖరి పట్ల     అసంతృప్తి వ్యక్తం చేస్తూ దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వినోద్ కు మద్దతుగా  కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాల్లో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. విషయం తెలిసిన బిఆర్ఎస్ అధిష్టానవర్గం రంగంలోకి దిగి నియోజకవర్గ ఇన్చార్జి వెంకటేష్ నేత, ఓరియంట్  గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడు రామ్మోహన్ రావుతో శనివారం కాసిపేట మండల కేంద్రంలోని వైస్ ఎంపీపీ విక్రమ్ రావు ఇంట్లో అసమ్మతినేతలతో చర్చలు జరపడం మండలంలో సంచలనం కలిగించింది.

 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం  ఆవిర్భావం తర్వాత గత పదే ళ్లుగా  ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో  తెరాస పార్టీ కార్యకర్తల కృషితో  దుర్గం చిన్నయ్య  ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గత 2018 ఎన్నికల్లో  నియోజకవర్గం లోని అన్ని మండలాలలో  అతని ప్రత్యర్థిగా పోటీ చేసిన వినోద్ కంటే తక్కువ ఓట్లు వచ్చి  దుర్గం చిన్నయ్య ఓటమి అంచున చేరుకున్నా సమయంలో కాసిపేట మండలంలోని  అత్యధిక ఓట్లు రావడంతో అతి కష్టం మీద వినోద్ పై గెలవగలిగాడు. చివరి నిమిషంలో తమను గెలిపించిన కాసిపేట మండల అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండల వాసులకు హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే కొంతమందికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతోనే పార్టీలో అసంతృప్తి. 

బెల్లంపల్లి నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన దుర్గం చిన్నయ్య మండలంలోని పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులకు తగు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శలు వ్యక్తం అవుతుంది. గత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సర్పంచులను, నాయకులను తగు ప్రాధాన్యతనిస్తానని తమ పార్టీలో చేర్చుకొని పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి.బెల్లంపల్లి నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ మండలంలో పటిష్టంగా కనబడ్డ కొంతమంది స్థానిక నాయకుల వైఖరి వల్ల కార్యకర్తలు  తీవ్ర సంతృప్తి లోనే ఉన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాల్సి ఉండగా ఒంటెత్తుపోకడలో వెళుతూ కొంతమందిని తన వర్గంగా తయారు చేసుకుంటూ వారికి దళిత బంధు, బీసీ బందులు ఇవ్వడం మండల పార్టీ నాయకులకు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది.

ఆ నాయకుడి వైఖరిపై ఎన్నోసార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన పట్టించుకోకపోవడంతో అసంతృప్తితో రగిలిన నాయకులు అదను చూసుకొని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై తిరుగుబాటు చేసి  ప్రతీకారం తీర్చుకుంటున్నారనే  ప్రచారం జరుగుతుంది. పార్టీ అధ్యక్షుడు గ్రూపు రాజకీయాలు చేస్తూ న్నాడని ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం  మళ్లీ ఎన్నికలు అతని ఆధ్వర్యంలోనే జరుగుతాయి కాబట్టి తమకు ప్రాధాన్యత ఇవ్వరని భావించిన అసమ్మతి నేతలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పార్టీ నాయకుడిపై ఎమ్మెల్యేకు ఇటీవల అసమ్మతినేతలు ఫిర్యాదు చేసిన పట్టించుకోక పోవడంతో గత కొద్ది రోజులుగా అసమ్మతినేతలు ఎమ్మెల్యేకు  దూరంగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇటీవల అసమ్మతి నేతలకు నాయకత్వం వహిస్తున్న వైస్ ఎంపీపీ విక్రం రావు ఇంటికి వచ్చి బుజ్జగింపులు చేశారు. గత నాలుగేళ్లుగా ఎమ్మెల్యే వైఖరిపై తాను ప్రాధాన్యత ఇస్తున్న మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి  విషయమై మాట్లాడారు.గత ఐదేళ్లుగా మా బాధలు,సమస్యలు ఎన్నోసార్లు మీ ముందు చెప్పిన పట్టించు కోలేదని, మళ్లీ మీరు గెలిచిన వాళ్ల మాటలే వింటారని మాకు ప్రాధాన్యత ఇవ్వరు కాబట్టి మా దారి మేము చూసుకుంటా మని  కుండ బద్దలు కొట్టి చెప్పారని విశ్వాసనీయ సమాచారం. వీరిని బుజ్జగించడం తమతో కావడం లేదని ఎమ్మెల్యే గత శనివారం నియోజకవర్గ ఇన్చార్జి పెద్దపెల్లి ఎంపీ వెంకటేష్ నేతను, ఓరియంట్ సిమెంట్ కర్మాగార గుర్తింపు అధ్యక్షుడు రామ్మోహన్ రావు ను మండల కేంద్రంలోని వైస్ ఎంపీపీ విక్రమ్ రావు  ఇంటికి పంపారు. వారితో జరిగిన చర్చలలో జెడ్పిటిసి  పల్లె చంద్రయ్య, తో పాటు నలుగురు ఎంపీటీసీలు, 12 మంది సర్పంచులు మండల పార్టీ నాయకులతో చర్చలు జరిపారు. అసమ్మతి నేతలు తమ డిమాండ్లను వాళ్ళ ముందు ఉంచి ఎట్టి పరిస్థితుల్లోనూ  దుర్గం చిన్నయ్యకు  సహకరించేది లేదని, వేరే అభ్యర్థిని మార్చాలని కరాకండిగా చెప్పినట్టు సమాచారం. వెంకటేష్ నేత రామ్మోహన్ రావు  చాలాసేపు వారిని బుజ్జగించే ప్రయత్నం చేసి మీ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి కేటీఆర్ తో మాట్లాడిస్తా నని అప్పటివరకు పార్టీని విడిచి వెళ్ళవద్దని కోరినట్టు తెలిసింది. అసమ్మతినేతలు కొద్ది రోజులు పార్టీ వీడకుండా  వేచి చూస్తామని వెంకటేష్ నేతకు హామీ ఇచ్చినట్టు తెలిసింది.

పార్టీని వీడేందుకే అసమ్మతి నేతల ప్రయత్నాలు.

మండలంలోని అసమ్మతినేతలు బి ఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేందుకు ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గాల్లోని వివిధ  మండలాల అసమ్మతి నేతలతో సంప్రదింపులు  సాగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది.

 గతంలో మండల పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చిన విక్రం రావు. 

అసమ్మతి వర్గం నేత వైస్ ఎంపీపీ విక్రం రావు గత మండల పరిషత్ ఎన్నికల్లో కూడా  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మండల పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి మాటలను ఖాతరు చేయకుండా తన పంతాన్ని నెగ్గించుకున్నాడు . అప్పటి ఎన్నికల్లో ఎంపీపీ అభ్యర్థి బడావత్ నీలా పల్లం గూడ ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోయింది.ఎమ్మెల్యే చిన్నయ్య  మండల ప్రెసిడెంట్ రమణారెడ్డి లు ఎంపీపీ రోడ్డ లక్ష్మి కాకుండా  పల్లంగూడ ఎంపీటీసీ చంద్రమౌళి ఎంపీపీ చేయాలని  క్యాంపు రాజకీయాలు పెట్టి ప్రయత్నాలు చేశారు. విక్రమ్ రావు  వారి ప్రయత్నాలను వమ్ముచేసి రోడ్డ లక్ష్మి ని ఎంపీపీ గా తన అనుచరుడు సిరాజ్ ఖానును  కోఆప్షన్ మెంబర్ గా చేసుకొని తన పంతం నెగ్గించుకున్నాడు. దీన్నిబట్టి విక్రమ్ రావు వర్గం చివరి వరకు ఎమ్మెల్యేకు మద్దతిస్తాడా లేదా అనేది కూడా చర్చనీయాంశం గా మారింది.