బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా శ్రీ దేవికి టికెట్ ఖరారు పట్ల బీజేపీ సంబరాలు.
![]() |
| బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవిని ఖరారు చేయడం పట్ల బీజేపీ కార్యకర్తల సంబరాలు. |
Scv News Kasipet:--
బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి నాయకురాలు శ్రీదేవి ఖరారు కావడం పట్ల కాసిపేట మండలం లోని బిజెపి కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
కాసిపేట మండల అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో దేవాపూర్ ,ముత్యం పెళ్లి గ్రామాలలో టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ మహిళలకు టికెట్లు కేటాయించడంలో అత్యధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింద న్నారు. బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో మహిళలకు సమచితస్థానం కల్పించడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దేవునురి సంతోష్, మండల ఉపాధ్యక్షులు భాకి నరేష్, రెడ్డి బాలరాజు, ఏదుల తిరుపతి, పెద్దపల్లి శంకర్, మండల కార్యదర్శి లు రామచందర్ ,సదయ్య , కిరణ్ బాకీ సురేష్,కిషన్ మోర్చా అధ్యక్షులు పోలవేని పొశం, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు దుర్గం దుర్గయ్య, మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ యూసఫ్, ఉదయ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

