పేద వర్గాల పెన్నిధి కాక వెంకట స్వామి జయంతి సందర్భంగా బిజెపి నాయకుల పండ్ల పంపిణీ.
![]() |
| ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండ్లు పంపిణీ చేస్తున్న బిజెపి నాయకులు. |
Scv News Kasipet :--
అణగారిన వర్గాల ప్రతినిధి అట్టడుగు పేదల పెన్నిధి జాతీయస్థాయిలో పదవులకు వన్నెతెచ్చిన తెలంగాణ ముద్దుబిడ్డ మాజీ కేంద్రమంత్రివర్యులు మహానేత కీర్తిశేషులు గడ్డం వెంకట స్వామి ( కాకా) గారి 94వ జయంతి సందర్భంగా ఈరోజు కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్కుమార్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు వృద్ధులకు బ్రెడ్లను అరటిపళ్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా BJYM జిల్లా అధ్యక్షులు పట్టి వెంకట క్రిష్, అసెంబ్లీ కన్వీనర్ రచార్ల సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రెవెల్లి రాజలింగు, బుక్య అరవింద్ , బాకీ నరేష్, బాలరాజు , పెద్దపల్లి శంకర్ ,నగరారపు ప్రసన్న, షేక్ యూసఫ్ , పోలవెని పొషం , బాకీ సురేష్, సబ్బాని రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.
