కాసిపేట మండల బిజెపి నూతన కమిటీ నియామకం.

మండల నూతన కమిటీ నియామక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి మునిమండ రమేష్.
Scv News Kadipet:--
భారతీయ జనతా పార్టీ కాసిపేట మండల కమిటీ సమావేశం ఈరోజు మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీ ని జిల్లా ప్రధాన కార్యదర్శి ముని మంద రమేష్ సమక్షంలో నియామకం చేశారు. నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని నియమితులైన వారు మండల పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముని మంద రమేష్ విష నిర్దేశం చేశారు.
కాసిపేట మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్,మండల ప్రధాన కార్యదర్శిగా భుక్య అరవింద్, దేవనురి సంతోష్, మండల ఉపాధ్యక్షులు గా బాకీ నరేష్, రెడ్డి బాలరాజు, ఏదుల తిరుపతి, పెద్దపల్లి శంకర్
మండల కార్యదర్శిగా జాడి రాజ్ కుమార్,బాకీ కిరణ్
మండల కోశాధికారిగా రత్నం కృష్ణ ,యువ మోర్చా అధ్యక్షులు గా నాగరారపు ప్రసన్న, గిరిజన మోర్చా అధ్యక్షులుగా భూక్య ప్రవీణ్ , మైనార్టీ మోర్చా అధ్యక్షులుగా షేక్ యూసఫ్ ,
మహిళా మోర్చా అధ్యక్షులుగా
దాగం లీల, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గా మారం రంజిత్ కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా పొలవెని పోషం లను నియమించారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రచార్ల సంతోష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేవెల్లి రాయలింగు తదితరులు పాల్గొన్నారు.