మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పర్యటన.

 కాసిపేట మండలంలో  బిజెపి జిల్లా అధికార ప్రతినిధి  పర్యటన.

 కాసిపేట మండలంలో బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల కృష్ణదేవరాయలు పర్యటన.


Scv News Kasipet:--

 కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో ప్రవాస్ యోజనలో భాగంగా ఈరోజు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి చిలుముల కృష్ణదేవరాయలు పర్యటించి   బూత్ కమిటీ,శక్తి కేంద్ర లు మండల కమిటీల పరిశీలన చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణ దేవరాయలు గారు మాట్లాడుతూ కాసిపేట మండలంలో బిజెపి పార్టీని బలోపేతం చేయడానికి మీరందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరిని ప్రకటించిన వారితో కలిసి పని చేయాలని, పార్టీబలోపేతానికి కృషి చేయాలని,పార్టీని నమ్ముకుని కష్ట పడి పనిచేస్తే తప్పకుండా తగిన గుర్తింపు వస్తున్ దని  వారు ఈ సందర్భంగా చెప్పడం జరిగింది.

ఈ కార్యక్రమానికి బిజెపి పార్టీ  మండల అధ్యక్షులు సూరం సంపత్ కుమార్ అధ్యక్షత వహించగా  ఈ కార్యక్రమం  లో మండల ప్రధాన కార్యదర్శి దేవునురి సంతోష్, శక్తి కేంద్ర ఇంచర్జిలు  బాకీ నరేష్, బుక్యా అరవింద్ ,రెడ్డి బాలరాజు , దోమల రామచందర్, మండల ఉపాధ్యక్షులు పొలవేని పోషం బిజెపి నాయకులు పెదపెల్లి శంకర్ కార్యకర్తలు తదితరులు  పాల్గొనడం జరిగింది.