మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట ప్రెస్ క్లబ్ లో బాలగోపాల్ వర్ధంతి.

 కాసిపేట ప్రెస్ క్లబ్ లో  ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  మానవ హక్కుల నేత  బాలగోపాల్ 14వ వర్ధంతి కార్యక్రమం.

-  దేవాపూర్ లో బాలగోపాల్ స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలి.

బాలగోపాల్ చిత్రపటానికి పూలమాల సమర్పిస్తున్న కాసిపేట మండల ప్రజాసంఘాల నాయకులు.


 బాలగోపాల్ కు నివాళులర్పిస్తున్న ప్రజా సంఘాల నాయకులు మీడియా ప్రతినిధులు.


Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మానవ హక్కుల నేత  బాలగోపాల్ 14వ వర్ధంతి కార్యక్రమం ఆదివారం మండలం లోని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు.  ముందుగా బాలగోపాల్ చిత్రపటానికి ప్రజా సంఘాల నాయకులు పూలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలగోపాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కుల కోసం సహజ సంపదల కాపాడటం కోసం చేసిన  పోరాటాల గురించి మండల ఐకాస కన్వీనర్ శిలోజు మురళి అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా ఫంట్ రాష్ట్ర నాయకుడు శ్రీమన్నారాయణ మాట్లాడుతూ


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాలగోపాల్ నిరంతరం ప్రజాసేవ మానవ హక్కుల కోసం పోరాడిన మహనీయుడని కొనియాడారు. పౌర హక్కులకు విఘాతం కలిగించిన ప్రభుత్వానికి వ్యతిరేకం గా,రాజ్య హింసకు వ్యతిరేకంగా, పకృతి వనరుల ధ్వంసానికి  వ్యతిరేకంగా ప్రజలతో ఎన్నో ఉద్యమాలను నిర్వహించా డన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో  ప్రాజెక్టుల పేరుతో దోపిడీ, పకృతి వనరుల ధ్వంసం విపరీతంగా జరుగుతుందని బాలగోపాల్ బ్రతికుంటే ఈ అక్రమాలపై ప్రజలతో ఉద్యమించే వాడని అన్నారు. దేవాపూర్ లో  బాలగోపాల్ స్మారక గ్రంథాలయా న్ని ఏర్పాటు చేయాలని ప్రజాసంఘాలను కోరారు. బాలగోపాలు జయంతి వర్ధంతి ల సందర్భంగా స్మారకోపాన్యాసాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికీ తన వంతు సహకారం అందిస్తానని అన్నారు.


మండల ఐకాసా  కన్వీనర్ సిలోజి మురళి మాట్లాడుతూ కాసిపేట ఓపెన్ కాస్టును నిలుపుదల లో బాలగోపాల్ పాత్ర క్రియాశీల మైందని గుర్తు చేశారు. ఓపెన్ కాస్ట్ రద్దు కోసం కాసిపేట గ్రామంలో తిరుగుతూ ప్రజలను చైతన్య వంతులను చేశాడని అన్నారు. బాలగోపాల్ పోరాటంతో  యాజమాన్యం ఓపెన్ కాస్ట్ ను రద్దు చేసుకుందని గుర్తు చేశారు. బాలగోపాల్ మరణం అనంతరం  గరేని యాజమాన్యం పేరు మార్చుకొని మళ్లీ ఉపరితల గనిని ప్రారంభించిందని అన్నారు.


సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడుతూ బాలగోపాల్ ఆదివాసుల హక్కుల కోసం, పౌర హక్కుల కోసం నిరంతరం ప్రజలకు చైతన్యవంతం చేస్తూ ఏన్నో  ఉద్యమాలు చేపట్టాడన్నారు. రాజ్య హింసనే కాకుండా కమ్యూనిస్టు నక్సలైట్ల హింసను కూడా ఖండించాడన్నారు. పోలీస్ ఇన్ ఫార్మర్ల పేరుగా మావోయిస్టు లు అమాయక ప్రజలను హత్య   చేసిన సందర్భంగా వారిని కూడా ప్రశ్నించాడు అన్నారు. బాలగోపాల్లేని లోటు ప్రజా సంఘాలకు ఆదివాసి సంఘాలకు తీరని లోటని అన్నారు.



అంబేద్కర్ సంఘం మండల నాయకుడు దాసరి రాజన్న మాట్లాడుతూ 1990 ప్రాంతంలో లో ఆంధ్ర ప్రదేశ్ లో  జరిగిన బూటకపు ఎన్కౌంటర్ లపై నిజ నిర్ధారణ కమిటీల పేరట విచారణ జరిపి అమాయక ప్రజలను పోలీసులు హత్య చేశారని నిరూపించాడన్నారు. ఆ రోజుల్లో కాసిపేట మండలంలోని వెంకటాపూర్ లో ఊటకపు ఎన్కౌంటర్లో ముగ్గురు అమాయక యువకులను చంపిన విషయమై ఇక్కడికి వచ్చి విచారణ చేశాడని గుర్తు చేశారు. తన ప్రాణాలకు లెక్కచేయకుండా పోలీసుల హింస, దోపిడీదారుల కుట్రలను ఎప్పటి కప్పుడు ప్రజలకు వివరించేవాడని అన్నారు.


జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శ గోనెల శ్రీనివాస్ మాట్లాడుతూ బాలగోపాల్ భూమి హక్కుల కోసం వాసుల కోసం నిరంతరం పోరాటాలు చేశాడన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ చేసినప్పుడు అసైన్డ్ భూముల పట్టాదారులకు తక్కువ పరిహారం వచ్చేదన్నారు. దీనిపై బాలగోపాల్ కోర్టుకు లో కేసు వేసి ప్రాజెక్టులో ముప్పు కు గురైన భూములకు పరిహారం పట్టాదారులతో సమానంగా అసైన్డ్ భూముల కూడా ఇప్పించిన ఘనత బాలగోపాల్ దేనిని గుర్తు చేశారు. కాసిపేట  ఉపరితల గనిలో లక్ష రూపాయలు కూడా విలువ చేయని అసైన్డ్ భూములకు 14 లక్షలు పరిహారం రావడం బాలగోపాల్ కృషి వల్లనే వచ్చాయని అన్నారు.



సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ నిరంతరం ప్రజల హక్కు ల కోసం పోరాడిన పౌర హక్కుల నేత బాలగోపాలని అన్నారు. ప్రభుత్వ హింసకు, భూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఉద్యమ నేత బాలగోపాలని కొనియాడారు. రాజ్య హింసకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ పౌర  హక్కులను ప్రచారం చేశాడన్నారు. బాలగోపాలను పోలీసుల అండతో రెండుసార్లు హత్య ప్రయత్నం జరిగాయని గుర్తు చేశారు. బాలగోపాల్ అకాల మరణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలకు తీరని లోటని అన్నారు.


ఓపెన్ కాస్ట్ వ్యతిరేక ఉద్యమకారుడు బోగె పోశం మాట్లాడుతూ బాలగోపాల్ సార్ సింగరేణి ఓపెన్ కాస్ట్లకు వ్యతిరేకంగా భూగర్భ గనుల్లో జరిగిన ప్రమాదాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు వేసి కార్మికుల తరఫున పోరాడా రన్నారు. కాసిపేట ఓపెన్ కాస్ట్ రద్దు చేసేందుకు స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టిన మహానేత అని గుర్తు చేశారు. నిరంతరం ప్రజల కోసం పనిచేసే  బాలగోపాల్ లాంటి నాయకుడు దొరకడం కష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక నాయకుడు కలవల శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.