గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ లు .

గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్ లు.
Scv News Kasipet:--
కాసిపేట మండల కేంద్రంలో గాంధీ జయంతి రోజు కూడా అంగన్వాడి టీచర్లు ఆశ వర్కర్లు ఆందోళన చేపట్టారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 22 రోజులకు చేరుకుంది.వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 8వ రోజుకు చేరుకుంది.
గాంధీ జయంతి సందర్భంగా అంగన్వాడి టీచర్లు ఆందోళనలో భాగంగా త మ సమస్యలు పరిష్కరించాలని గాంధీ చిత్రపటానికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఆశా వర్కర్లు మండల కేంద్రం నుండి ముత్యం పల్లి కాసిపేట గ్రామాల మధ్యలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద కు వెళ్లి తమ వేతనాలు పెంచాలని, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇవ్వాలని నినాదాలు చేస్తూ వినతి పత్రాన్ని గాంధీ విగ్రహంకు అందజేశారు.