మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆందోళన.

 కాసిపేట మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్ల ఆందోళన.

 - నల్ల జెండాలు ఎగురవేసిన అంగన్వాడి టీచర్లు,

 - కళ్లకు గంతలు కట్టుకొని  ఆశ వర్కర్లు నిరసన.



 కాసిపేట మండల కేంద్రంలో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు.


Scv News Kasipet:--

 కాసిపేట మండల కేంద్రంలో ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించే అంగన్వాడి టీచర్లు ఆయాలు చేసే సమ్మె 21 రోజులకు చేరుకుంది.వైద్య సేవలందించే ఆశా వర్కర్ల సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ టీచర్లు, తమ వేతనాలను పెంచాలని ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. ఉద్యోగ భద్రత ప్రమాద బీమా లాంటి తమ  న్యాయమైన సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆందోళన చేస్తున్నారు. ప్రతిరోజు  అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు  ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని  వినూతన పద్ధతిలో నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు అంగన్వాడి టీచర్లు నల్ల జెండాలు ఎగురవేసి  నిరసన వ్యక్తం చేశారు.

ఆశా వర్కర్లు తమ వేతనాలు పెంచాలని ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కళ్లకు గంతలు కట్టుకొని   నిరసన వ్యక్తం చేశారు.