మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో మరో నూతన గిరిజన సంఘం ఏర్పాటు

 ఆదివాసి సేన మండల కమిటీ ఎంపిక.

 మండల ఆదివాసి సేన కమిటీ అధ్యక్షుడు మడావి వెంకటేష్ కు నియామాక పత్రాన్ని అందజేస్తున్న జిల్లా అధ్యక్షుడు కోట్నాక తిరుపతి.


Scv News Kasipet :--

 ఏజెన్సీ మండలమైన కాసిపేటలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ తమ  సమస్యల పరిష్కారం కోసం, ఉద్యమాలు నిర్వహించేందుకు,మరో నూతన గిరిజన సంఘం ఏర్పాటు అయింది. కాసిపేట మండలం కొండాపూర్ గ్రామంలో శనివారం మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పటేల్ రాయి సెంటర్ సర్మిడీలు తుడుం దెబ్బ మహిళా సంఘాలు, ప్రతి గ్రామ సర్పంచులు సమావేశమై ఆదివాసి సేన మండల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా  మంచిర్యాల జిల్లా ఆదివాసీ సేన   అధ్యక్షులు కొట్నక తిరుపతి హాజరైనారు. మండల గిరిజనుల సమస్యలపై చర్చించి అతని ఆధ్వర్యంలో మండల ప్రజల యొక్క అభిప్రాయం మేరకు  ఆదివాసీ సేన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా మడావి గంగారాం.

మండల కమిటీ అధ్యక్షుడిగా

మడావి వెంకటేష్.

వర్కింగ్ ప్రెసిడెంట్ గా

పెందూర్ శంకర్ 

 ప్రధాన కార్యదర్శిగా 

సిడం గణపతి.

ఉపాధ్యక్షులుగా

పెందుర్ ప్రభాకర్,

 కోశాధికారిగా 

ఆత్రం సంజీవ్,

సలహాదారు లుగా 

కుంరం జనార్దన్.

 సిడం శంకర్.

 ఉపాధ్యక్షులుగా 

 వెడ్మా బాపురావ్,

అర్క జైతూ

 కుర్శింగ ఈస్రు, మాడవి ప్రభత్ రావ్,పంద్రం సింగు ఉయిక మోతిరావు లను ఎన్నుకున్నారు.