కాసిపేట మండలంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినం.

జాతీయ జెండాను ఎగురవేస్తున్న బిజెపి మండల కమిటీ అధ్యక్షుడు సూరం సంపత్ కుమార్. 
దేవాపూర్ లో జాతీయ జెండాను ఎగురవేస్తున్న బిజెపి
నాయకులు.
Scv News Kasipet:--
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనదినాన్ని పురస్కరించుకొని కాసిపేట మండలంలోని చిన్న ధర్మారం, ముత్యం పల్లి, దేవాపూర్ గ్రామంలోని శక్తి కేంద్రాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినం నిర్వహించారు. చిన్న ధర్మారం గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ బిజెపి మండల అధ్యక్షులు సూరం సంపత్ అధ్యక్షతన జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. దేవాపూర్ శక్తి కేంద్రంలో సదయ్య, రామచంద్ ఆధ్వర్యంలో ముత్యం పల్లి శక్తి కేంద్రాల్లో జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది.
ఈ సందర్భంగా అట్కపురం రమేష్, దేవునూరి సంతు మాట్లాడుతూ తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనలో విముక్తి1948 సెప్టెంబర్ 17విముక్తి లభించిందని . గతంలో నిజం పాలనలో ఉండి ప్రస్తుతం మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలలో విమోచన దినోత్సవాన్నిఅధికారికంగా జరుపుకుంటున్నారన్నారు.అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు కే చంద్రశేఖర రావు. తెలంగాణ విమోచన దినోత్సవం జరుపు కోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం పైన రోడ్ల పైన ధర్నాలు చేయడం జరిగిందని మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో విమోచన దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవడం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి దేవనురి సంతోష్ యవమోర్చ మండల అధ్యక్షులు నగరపు ప్రసన్న మైనార్టీ మోర్చా అధ్యక్షులు యూసఫ్, బిజెపి నాయకులు రెడ్డి బాలరాజు బుక్ర్య ప్రవీణ్ , జాడి ప్రసాద్ సురేష్ కిరణ్ , యువమోర్చా ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు