మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

కాసిపేట మండలంలో డెంగ్యూ జ్వరాలతో తల్లాడిల్లుతున్న గిరిజనులు.

 

 దొడ్డిగూడెం లో  డెంగ్యూ జ్వరంతో యువకుడు మృతి.

-- దేవాపూర్ నాయకపు గూడెంలో మంచాన పడ్డ గిరిజనులు.

 విష జ్వరంతో మృతి చెందిన దొడ్డిగూడెం చెందిన కుడిమేత జలపతి (13)బాలుడి పాత ( ఫోటో)

 


 దేవాపూర్ నాయకపు గూడెంలో జ్వరాలతో మంచాన పడిన గిరిజనులు.
Scv News Kasipet :--

 కాసిపేట మండలం సోనాపూర్ గట్రావ్ పెళ్లి పంచాయతీలోని గిరిజన గూడాలలో డెంగ్యూ, విష జ్వరాలతో గిరిజనులు తల్లటిలిపోతున్నారు. పదుల సంఖ్యలో గిరిజనులు జ్వరాలతో మంచానపడ్డారు. సోనాపూర్  పంచాయతీ పరిధిలోని దొడ్డిగూడ గ్రామానికి చెందిన కుడుమేత జలపతి (13) బాలుడు గత  నాలుగు రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ గత సోమవారం మృతి చెందాడని బంధువులు తెలిపారు. గట్రావుపల్లి సాలె గూడెం, పెద్దాపూర్, నాయకపోడు  గ్రామాలలో  గిరిజనులు జ్వరాలతో బాధపడుతున్నారు. దేవాపూర్ నాయకపు గూడెంలో బైర్నేని మల్లక్క,కొమ్ముల భీమయ్య, మల్లేష్ బద్ది నవీన్, కీర్తన, కొలకాని లక్ష్మీ తదితరులు జ్వరాలతో బాధపడుతున్నారు, గత నెల రోజులుగా ఏఎన్ఎం ఆశా వర్కర్లు గ్రామాలకు రావడంలేదని మండల వైద్యాధికారులు స్పందించి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదివాసి నాయక్ పోడ్ సేవా సంఘం  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి   కొమ్ముల బాబు, మండల గిరిజన సంఘం నాయకుడు కనకమానుకు ప్రకటనలో అధికారులను కోరారు.