తాటి గూడెం ఆదివాసీ గూడలో పోరా పండుగ.

పోరా పండుగ సందర్భంగా గ్రామ శివారులో పోయి పండుగ చేసుకుంటున్న తాటి గూడెం యువకులు
Scv News Kasipet:-
కాసిపేట మండ లంలోని తాటి గూడ గ్రామం లో శుక్రవారం పోరా పండగా నిర్వహించడం జరిగింది. గోండు గిరిజన తెగల ఆచార సంస్కృతి ప్రకారం ఈ పండుగను గ్రామంలోని గిరిజనులు సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతు పోలాల అమవాస్య ను పురష్కరించుకొని ఆదివాసి గూడలో పోరాపండగ జగేయి మతరీ జగెయ్, దోమలు, ఈగలు, దగ్గు, జగేయ్ అంటు నినాదంతో బడగళ్లతో ఊరి చివరన ఉన్న శివారు వరకు వెళ్లడం జరుగు తుందని తెలిపారు. ఆదివాసులు లకు పోలాల అమవాస్య రోజున జరుపుకునే పోరా పండగా పెద్ద పండగగా వారు తెలిపారు. గ్రామం నుండి కర్రలు చేతబట్టి ఊరి నుండి అన్ని మహామ్మారిలు బయటకు పోవాలని ఊరి బయటకు వెళ్లడం జరుగుతుందని వారు తెలిపారు. గ్రామంలో పిల్లా, జెల్లా సల్లంగా ఉండా లని ఊరు శివారులో పూజలు నిర్వహించి సాముహిక పూజలు నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ మడావిశేఖర్,మడావి వెంకటేష్, మడావి గోపాల్,సిడం కమలాకర్ వెలాది అర్జున్,మడావి రాజు, తదితరులు పాల్గోన్నారు.
