బహుమతులను ప్రధానం చేసిన వార్డు మెంబర్ ఏల్పుల గంగ- బుచ్చయ్య.

ముత్యంపల్లి వార్డ్ మెంబర్ గంగ బుచ్చయ్య దంపతులను సన్మానిస్తున్న గ్రామస్తులు.
Scv News Kasipet :---
కాసిపేట మండలంలోని ముత్యంపల్లి శ్రీ సరస్వతి యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వార్డ్ మెంబర్ ఏల్పుల గంగ బుచ్చయ్య పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించి,బహుమతులను ప్రధానం చేశారు. వార్డ్ మెంబర్ మాట్లాడుతూ పిల్లలు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రతీ ఏటా ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటల వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా ఉత్సహాకంగాఉంటారన్నారు .
అనంతరం కమిటీ సభ్యులు, మహిళలు వార్డు మెంబర్ దంపతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బొడ్డు వెంకటేష్,నితీష్,కుమార్, శ్యామ్,గిరిజ,వజ్ర,స్వరూప,సత్యవతి,తదితరులు పాల్గొన్నారు.