పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు.పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని ఎమ్మార్పీఎస్ రిలే నిరాహార దీక్షలు.
![]() |
| ఎస్సీ వర్గీకరణ చేయాలని రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎమ్మార్పీఎస్ నాయకులు. |
Scv News Kasipet :--
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటరీ ప్రత్యేక సమావేశాలలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాసిపేట మండల రెవెన్యూ కార్యాలయం ముందు ఈరోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.రిలే నిరాహార దీక్ష జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కల ప్రశాంత్ మాదిగ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.దీక్షలో పాల్గొన్నవారు మలకపల్లి గ్రామ అధ్యక్షుడు పడిగల సతీష్,మాదిగ దేవాపూర్ MRPS కమిటీ సభ్యులు ములకల అరుణ్ మాదిగ, ఉప్పులేటి శ్రీరామ్ మాదిగ, రామిల్ల సూరి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు ముల్కల ప్రశాంత్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ గత 29 ఏళ్లుగా పోరాడు తున్నాడని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ బిజెపి నాయకులు వర్గీకరణకు మద్దతు ఇస్తున్నామని ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన తరువాత మరచిపోతున్నారని విమర్శించారు. ప్రస్తుత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలలో బిజెపి నాయకులు గతంలో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు.
మండల ఎంఆర్పిఎస్ ఇంచార్జ్ పంగల లక్ష్మణ్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా బిల్లు, బిసి రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధానమంత్రి కి లేఖ రాశాడని ఎస్సీ వర్గీకరణ కోసం మాత్రం మార్చాడని విమర్శించారు. గతంలో ఎస్సీ వర్గీకరణకు తప్పకుండా మద్దతు ఇస్తున్న అని ప్రకటించిన కేసీఆర్ ప్రస్తుతం మాట్లాడకపోవడం శోచనీయమని అన్నారు. వర్గీకరణకు మద్దతు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో మాదిగలు టిఆర్ఎస్ వ్యతిరేకంగా పనిచేస్తారని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలకు సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య సంఘీభావాన్ని ప్రకటిస్తూ ఈరోజు దీక్షలను నిమ్మరసమిచ్చి విరమింప చేశారు.

