మండలంలోని వార్తలను ఎప్పటికప్పుడు పొందడానికి Kasipet Mandal App Install చేసుకోండి.

దేవాపూర్ లో 21వ శతాబ్దపు సామాజిక ఉద్యమ పరిచయ సమావేశం.

 దేవాపూర్ లో m21 పరిచయ సమావేశం.

-  పెరియార్ జయంతి కార్యక్రమం.

 దేవాపూర్ లో  M 21 పరిచయ సమావేశానికి హాజరైన అంబేద్కర్ వాదులు. 



Scv News Kasipet:--

 కాసిపేట మండలం దేవాపూర్ అంబేద్కర్ భవన్ లో పూలే, అంబేద్కర్ భావజాలంతో ప్రారంభమైన 21వ శతాబ్ద సామాజిక ఉద్యమ( m21) పరిచయ సమావేశం జరిగింది. సమావేశంలో దేవాపూర్ లోని  అంబేద్కర్ సంఘం కమిటీలతో పాటు ఇతర ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సమావేశ ప్రారంభంలో పెరియార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. పెరియార్ చిత్రపటానికి సమావేశానికి హాజరైన వారు పూలు సమర్పించి నివాళులర్పించారు. పెరియార్ సమాజానికి చేసిన సేవను ఉద్యమాల గురించి ఎం 21 ఇన్స్ట్రక్టర్ కమల్ వివరించారు.

 ఎం21 ఉద్యమ తీరుతెన్నులను వివరిస్తున్న ఇన్స్ట్రక్టర్ కమల్.
తదనంతరం ఎం 21 పరిచయ సమావేశంలో దేశంలో బహుజన వర్గాలను ఏకం చేసేందుకు  పూలే అంబేద్కర్ సైదాంతిక పునాదిగా రాజ్యాంగ మూల సూత్రాలతో పనిచేసేందుకు 21వ శతాబ్ద ఉద్యమం పనిచేస్తుందని తెలిపారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్నా బహుజనులు అభివృద్ధి పొందలేక అగ్రకులాల చేతిలో అణచివేతకు గురవుతున్నారని వివరించారు. బహుజన వర్గాల విముక్తి కోసం అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని తీసుకువచ్చిన  అమలు కాకుండా అగ్రవర్ణాలు అడ్డుకుంటు న్నాయన్నా రు. అంబేద్కర్ అనంతరం బహుజన ఉద్యమాలు  ఎన్నో ప్రారంభమైన గ్రామ పునాదుల తో నిర్మాణం కాకపోవడం  రైతులు యువత స్త్రీలను సమీకరించక పోవడం వల్ల గత ఉద్యమాలు విఫలమ య్యాయని అన్నారు.

పూలే అంబేద్కర్ భావజాలంతో ఉన్న మేధావి వర్గం  గత ఉద్యమాల వైఫల్యాన్ని గల కారణాలను విశ్లేషించి శాస్త్రీయ పద్ధతిలో గ్రామ స్థాయి నుండి ఉద్యమా లను నిర్మాణం చేసేందుకు 21వ శతాబ్ద సామాజిక ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ ఉద్యమంలో ఎస్సీ ఎస్టీ  బీసీలతో కూడిన బహుజనులు మాత్రమే ఉంటారని ఇది సమిష్టి ఉద్యమం అని తెలిపారు. ఈ ఉద్యమం కి అధ్యక్షులు కార్యదర్శులు ఉండరని అందరూ సమాన హోదా తోనే పని చేస్తారని వివరించారు. ఈ ఉద్యమం రాజకీయాలతోటి సంబంధం లేకుండా అంబేద్కర్ పూలే భావజాలంతో పనిచేసే సామాజిక,సాంస్కృతిక ఉద్యమంగా పనిచేస్తుందని వివరించారు.సంస్థలో కళాకారులు విద్యార్థులు రైతులు, మహిళా కమిటీలు పనిచేస్తాయని పూలే, అంబేద్కర్ ఆలోచనలతో నీతివంత మైన సమాజంకొరకు  గ్రామస్థాయి నుండి నిర్మాణం చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.

 పరిచయ సమావేశానికి అంబేద్కర్ సంఘం మండల  నాయకులు వడ్లూరు మల్లేష్, రామిళ్ళ కిష్టయ్య పంగల లచ్చన్న, రాజమౌళి ముల్కల స్వామి రాములు,నాయక్ పోడ్  సేవా సంఘం మండల అధ్యక్షుడు బద్ది శ్రీనివాస్, కార్యదర్శి రెడ్డి లక్ష్మణ్, తుడుం దెబ్బ నాయకులు ఆత్రం జంగు, అంబేద్కర్ కమిటీ ప్రజా సంఘాల నాయకులతో పాటు   ఎం 21 జిల్లా నాయకులు నాగేశ్వరరావు,బక్కయ్య, ఎడ్ల కిష్టయ్య ,మండల ఇన్చార్జి పల్లె మల్లయ్య,సభ్యులు  కొమ్ముల బాపు,సాయికిరణ్ లు పాల్గొన్నారు.

సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడికి సన్మానం.

 సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు, m 21 మండల ఇన్చార్జ్  పల్లె మల్లయ్య ను సన్మానిస్తున్న అంబేద్కర్ కమిటీ సభ్యులు.
మండలంలో సీనియర్ జర్నలిస్టుగా అవినీతి అక్రమాలపై అవిశ్రాంతి  పోరాటం చేసి అంబేద్కర్ ఇస్టుగా పనిచేస్తూ సామాజిక ఉద్యమాలను గ్రామాలకు విస్తరిస్తున్నందుకు గుర్తింపుగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్యను అంబేద్కర్ కమిటీ సభ్యులు  శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా పల్లె మల్లయ్య మాట్లాడుతూ మండలంలోని ప్రజాసంఘాల నాయకులు కార్యకర్తలంతా  బహుజన సామాజిక ఉద్యమమైన m21లో చేరాలని కోరారు. పూలే అంబేద్కర్ ఆలోచనతో పని చేసే  m21 ఉద్యమాన్ని గ్రామస్థాయిలో  విస్తరించేందుకు కృషి చేస్తానని సన్మానించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.