కాసిపేట మండలంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.
![]() |
| సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో దేవాపూర్ ఉన్నత పాఠశాలలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి. |
Scv News Kasipet:--
స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషిచేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం కాసిపేట మండలంలో ఈరోజు ఘనంగా జరిగింది. దేవాపూర్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో, దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
![]() |
| దేవాపూర్ లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. |
దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సామాజిక చైతన్య వేదిక నాయకులు పాఠశాల ఉపాధ్యాయ బృందం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .
ఈ సందర్భంగా సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి లో జన్మించి దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీలో ఉండి పోరాడాడని, తరువాత తెలంగాణలో నైజాం నవాబ్ వ్యతిరేకంగా రజాకార్లతో పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవిని కూడా త్యాగం చేసిన త్యాగదనుడని అన్నారు. బహుజనుల పోరాట చరిత్ర పాఠ్యపుస్తకాలలో చేరకపోవడం వల్ల వారి గురించి నేటి విద్యార్థులకు తెలియడం లేదన్నారు. దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొండ లక్ష్మణ్ బాపూజీ ధైర్యసహసాలతో పోరాడా డని ఆ యోధుడి చరిత్ర నేటి విద్యార్థు లకు తెలియాలనే ఉద్దేశంతో మేము పాఠశాలలో ఆ మహనీయుని జయంతి నిర్వహించడం జరుగు తుందని అన్నారు.
సామాజిక చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు మాట్లాడు తూ కొండా లక్ష్మణ్ బాపూజీ త్యాగ ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి హైదరాబాదులోని తన ఇంటిని పార్టీ ఆఫీస్ కోసం ఇచ్చిన మహనీయుడు అన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ ఉద్యమాలను త్యాగాలను నేటి తరాలు తెలుసుకోవాలని అన్నారు. పాఠశాల ఇంచార్జ్ ప్రధానో పాధ్యాయులు దామోదర్, ఉపాధ్యాయులు అంజాద్ పాషా, రాజేశం తదితరులు పాల్గొన్నారు.



