పంచాయతీ భవనాలకు భూమి పూజ.

కాసిపేట మండల పర్యటనలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. 
పంచాయతీ భవనాలకు భూమి పూజలు చేస్తున్న ప్రజాప్రతినిధులు.
Scv News Kadipet :--
కాసిపేట మండలంలోని వివిధ గ్రామాలలో బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం పర్యటించారు. లంబాడి తండా కే మల్కపల్లి, రొట్టె పెళ్లి గ్రామ పంచాయితీలకు భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో పంచాయతీ భవనాలకు భూమి పూజ చేశారు. రొట్టెపల్లి గ్రామంలో ఐదు లక్షల సిసి రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ నాకు టికెట్ రాకుండా ఎంతోమంది కుట్రలు చేసిన ముఖ్యమంత్రి కెసిఆర్ నాపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మండల ప్రజలంతా ఆశీర్వదించి మరోసారి భారీ మెజారిటీతో గెలిపించగలరని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రోడ్డలక్ష్మి , జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య , వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఎంపీడీవో ఎంఏ అలీ, మాజీ సింగిల్ విండో చైర్మన్ వంశీధర్ రావు,ఎంపీటీసీ రాంచందర్ , చంద్రమౌళి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజులరెడ్డి, సర్పంచ్ లు విజయ లక్ష్మి , కవిత, స్వప్న , తిరుపతి , రమటెంకి శ్రీనివాస్ , మక్కల శ్రీనివాస్ , మండల BRS పార్టీ అధ్యక్షులు రమణా రెడ్డి , మల్కపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు ప్రభాకర్ ప్రజాప్రతినిధులు, BRS నాయకులు, సంబంధిత అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.